సునీత ఉపద్రష్ట.. సినిమాలలో నటించకపోయినా సరే హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న సింగర్ లలో ఈమె కూడా ఒకరు. ఒక పాట పాడడానికి సుమారుగా 10 లక్షల రూపాయల పారితోషకం అందుకునే ఈ ముద్దుగుమ్మ.. విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుంది. తాజాగా సునీత ములుగు జిల్లాలోని గోవిందరావుపేట ప్రాంతంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం పరిమితంగా సినిమాలకు ఓకే చెబుతున్న సునీత భర్త మాంగో వీడియో అధినేత రామ్ వీరపనేని గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

అయితే రామ్ తండ్రి శివాజీ.. గోవిందరావుపేట ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఆయన ఎంతోమంది పేదలకు ఇల్లు కట్టించారని సమాచారం. కరోనా వల్ల ఆయన చనిపోగా ఆయనపై అభిమానంతో ఆ వూరి ప్రజలు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోని ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా సునీత కూడా హాజరైంది.. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో సునీత మాట్లాడుతూ.. మామగారి గురించి అందరూ గొప్పగా మాట్లాడుతుంటే.. సంతోషంగా ఉంది అని తెలిపింది.. మండలంలోని ప్రజలను చూస్తే తనకు చాలా సంతోషంగా అనిపిస్తోందని .. ఇంత మంచి ఫ్యామిలీకి కోడలిగా రావడం తనకు సంతోషాన్ని అందించిందని కూడా సునీత కామెంట్లు చేసింది.

Netizen asks for singer Sunitha's personal number - find out what happened  nextసునీత చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. సునీత కొత్త ప్రాజెక్టులకు సంబంధించి త్వరలో స్పష్టత రానుంది. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సునీత ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఈ మధ్యగుమ్మ.

ప్రస్తుతం సునీత తన కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇతర సింగర్లకు కూడా సునీత తన వంతు సపోర్టు అందిస్తూ ఉండడం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సునీత మనసు చాలా మంచిది అంటూ నెటిజెన్లు కూడా కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *