తెలుగు ఇండస్ట్రీలో యాంగ్రీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న హీరో రాజశేఖర్ అంటే అందరికీ సుపరిచితమే. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఈయన నటి జీవిత ని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు. వీరి కూతుర్లను కూడా ఇండస్ట్రీలో స్టార్స్ గా చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రాజశేఖర్ పెద్ద కూతురు రాజ్ తరుణ్ తో కలిసి అహనా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ లో కలిసి నటించింది.

అయితే సోషల్ మీడియాలో శివాని రాజశేఖర్ గురించి ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. అవేంటంటే.. రాజశేఖర్ కూతురు లవర్ తో దుబాయ్ కి లేచిపోయిందని కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఈ వార్తలపై శివాని రాజశేఖర్ స్పందించి తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసేదాకా ఈమెపై వచ్చిన వార్తలు ఆగలేదు. అయితే తాజాగా ఈ ఈ వార్తలపై మరొకసారి క్లారిటీ ఇచ్చింది శివాని రాజశేఖర్. శివాని రాజ్ తరుణ్ తో కలిసి అహనా పెళ్ళంట అనే వెబ్ సిరీస్లో కలిసి నటించింది. ఈ వెబ్ సిరీస్ లో పెళ్లికూతురు లేచిపోతుంది.

ఇక ఈ విషయాన్ని రాజశేఖర్ కూతురు తన బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది, దుబాయ్ కి చెక్కేసింది అంటూ ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఈ విషయంలో శివాని రాజశేఖర్ మాట్లాడుతూ.. అసలు మీరు పారిపోయింది పారిపోయింది అంటున్నారు ఇంతకీ పారిపోయింది నేనా? లేకపోతే శివాత్మికనా?అసలు మీరు చెప్పే బాయ్ ఫ్రెండ్ ఎవరు?కనీసం మీరు రూమర్లు చెప్పేటప్పుడైనా కొంచెం స్పష్టంగా రాయండి. అలాగే మీరు అనుకుంటున్నట్లు నేను దుబాయ్ వెళ్ళింది నా లవర్ తో కాదు నా కుటుంబంతో.

ఇక ఈ విషయంలో నేను ఇప్పటికే నా ఫ్యామిలీ ఫోటోలు కూడా షేర్ చేశాను. అలాగే నేను రాజ్ తరుణ్ తో ప్రేమలో పడ్డాను, ఇద్దరు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు అంటూ నెట్టింట్లో నాపై చాలా వార్తలు వస్తున్నాయి. కానీ నాపై వచ్చే ఈ ప్రేమ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఒకవేళ మేమిద్దరం వివాహం చేసుకోవాలనుకుంటే మాత్రం ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి అంటూ రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ చాలా ఫన్నీగా చెప్పుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *