అనిల్ రావిపూడి.. టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన అతికొద్ది మందిలో ఈయన ఒకరు. రచయితగా కెరీర్ ప్రారంభించిన అనిల్ రావుపూడి.. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన `పటాస్` సినిమాతో దర్శకుడుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న ఈయ‌న‌.. ఆ తర్వాత `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్2`, `సరిలేరు నీకెవ్వరు` రీసెంట్గా `ఎఫ్ 3` చిత్రాలను తెరకెక్కించాడు.

అయితే ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. అనిల్ రావిపూడికి స్టార్ హోదాను అందించాయి. కెరీర్‌ ఆరంభం నుంచి అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న అని రావిపూడి.. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ దర్శకుడుగా మారాడు. అయితే తాజాగా ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.

ఈ క్రమంలోనే తన సినిమాలు ఫ్లాప్ అంటూ వచ్చే వార్తలు పై అనిల్ రావిపూడి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. `నా సినిమాల వల్ల ఇప్పటివరకు ఏ ఒక్క బ‌య్య‌ర్‌, ఏ ఒక్క నిర్మాత నష్టపోలేదు. అయినా కూడా నా సినిమాలకు కలెక్షన్లు లేవని, రాలేద‌ని అనడం కామన్ అయిపోయింది. వరసగా హిట్ సినిమాలు చేస్తూ రావ‌డం వల్ల నా మీద జెలసీతోనే ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తున్నారు` అంటూ అనిల్ రావిపూడి కాస్త ఫైర్ అయ్యారు. ఇక ఈ సంద‌ర్భంగా తన తదుపరి ప్రాజెక్ట్ పై సైతం ఆయ‌న‌ పలు ఇంట్రెస్టింగ్ విషయాల‌ను షేర్ చేసుకున్నారు.

అనిల్ రావిపూడి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను నట‌సింహం నందమూరి బాలకృష్ణతో చేయబోతున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహో గార‌పాటి నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కాబోతోంది. తండ్రి కూతురు మధ్య ఈ మూవీ కథ నడుస్తుందని, ఇందులో బాలయ్య కూతురుగా శ్రీలీల‌ ఎంపికైందని ఆల్రెడీ గతంలో అనిల్ రావిపూడి వెల్లడించారు. అయితే తాజా ఇంటర్వ్యూలో ఆయ‌న‌.. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఒకటే అని డబల్ రోల్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు అలాగే బాలయ్య క్యారెక్టర్ ఫన్ చేయకపోయినా ఆ సినిమాలో ఫన్ జనరేట్ అయ్యేలా కథ‌ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు అనిల్ రావిపూడి కామెంట్స్ కాస్త సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *