ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ వీ వీ సత్యనారాయణ వారసుడిగా అల్లరి సినిమాతో ఇండస్ట్రీ లోకి వచ్చి మొదటి సినిమాతోనే తనలో ఉన్న కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దాదాపు ఈయన తెరకెక్కించిన అన్ని సినిమాలు కూడా హాస్య భరితమైన చిత్రాలే కావడం గమనార్హం . ముఖ్యంగా తన తండ్రి దర్శకత్వంలో కూడా ఎన్నో కామెడీ చిత్రాలలో నటించి మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న అల్లరి నరేష్.. దాదాపు 8 సంవత్సరాల పాటు వరుస ప్లాఫ్ లతో కొట్టుమిట్టాడు.

అయితే గత ఏడాది నాంది సినిమాతో తనలో ఉన్న మరో కోణాన్ని చూపించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అల్లరి నరేష్.. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించి ఆయనకు మంచి విజయాన్ని అందించింది. ఇక ఆ తర్వాత కామెడీ సినిమాలకు పులిస్టాప్ పెట్టి.. యాక్షన్ డ్రామా సన్నివేశాలతో కూడుకున్న చిత్రాలల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.. ఈ క్రమంలోనే ఆయన నటించిన మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ద్వారా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు అల్లరి నరేష్. అయితే ఈ సినిమా రిలీజ్ లో భాగంగా తన రాజకీయ ఎంట్రీ పై పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

సినిమా రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడం పై స్పందించాడు .. ” రాజకీయాలు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేని సబ్జెక్టు .. రాజకీయాలు నాకు పెద్దగా తెలియదు.. రాజకీయాల్లోకి రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. సినిమాల్లోనే సక్సెస్ అయితే చాలు .. అయితే డైరెక్టర్ అవుతా కానీ రాజకీయాలలోకి మాత్రం వెళ్ళను.. నేను చాలా సెన్సిటివ్.. సెన్సిటివ్ గా ఉండే వాళ్లకు రాజకీయాలు పెద్దగా పనికిరావు” అంటూ తన మనసులో మాటగా వెల్లడించారు నరేష్.

ఇకపోతే ప్రస్తుతం మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో ముందుకొచ్చిన నరేష్ ఈ సినిమా ద్వారా ఎలాంటి విజయాన్ని అందుకుంటారో తెలియాల్సి ఉంది. కనీసం ఈ సినిమా అయినా సరే మంచి విజయాన్ని అందించి ఆయన కెరియర్ లో దూసుకుపోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *