విశ్వక్ సేన్ హీరో గా స్వీయ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ధమ్కీ.  బాలకృష్ణ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక శ్రీమంతుడికి ఎదురైన సమస్యను, ఒక సాధారణమైన వెయిటర్ ఎలా పరిష్కరించాడనేదే కథ.

ఈ నేపథ్యంలో ఈ సినిమా యొక్క రిలీజ్ ను ప్లాన్ చేశాడు విశ్వక్. ఈ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయనున్నట్టుగా చెబుతూ అధికారిక పోస్టర్ ను వదిలారు. విష్వక్ యాక్షన్ లోకి దిగిపోయి నట్టుగానే ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ కామెడీ జోనర్లో నడిచే సినిమా ఇది.

ఈ సినిమాలో విష్వక్సేన్ సరసన నాయికగా నివేదా పేతురాజ్ అలరించనుంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో రావు రమేశ్ .. రోహిణి .. అజయ్ కనిపించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *