లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఖైది సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఆ తర్వాత ఈ సినిమా కి సీక్వెల్ చేయాలనే అందరు భావించారు. అలా ఇప్పుడు లోకేష్ ఈ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేశారు.

వచ్చే ఏడాదిలో కార్తి ‘ఖైదీ 2’ సినిమా చేయనున్నాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా లారెన్స్ కనిపించనున్నట్టు ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. అందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు.

ప్రస్తుతం లారెన్స్ ‘చంద్రముఖి’ సీక్వెల్ లో చేస్తున్నాడు. పి. వాసు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. హారర్ కామెడీ చిత్రాల పరంగా లారెన్స్ కి గల క్రేజ్ ఈ సినిమాకి కలిసొస్తుందని వాసు భావిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *