తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ఎంతో కష్టపడి నటుడిగా నిలదొక్కుకొని సూపర్ స్టార్ గా మారిపోయాడు. అప్పట్లో కృష్ణ ఏ సినిమా చేసినా ఒక కొత్త స్టైల్ ఉండేది. ఆ స్టైల్ ట్రెండింగ్ గా మారేది. అలాంటి సూపర్ స్టార్ కృష్ణ ఆంధ్ర జేమ్స్ బాండ్ గా పేరుపొందారు. ఆయన ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇంతటి ఘనత సాధించిన కృష్ణ మరణం సినీ ఇండస్ట్రీని, అభిమానులను శోకసంద్రంలో ముంచిందని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే ఆయన గురించి అనేక వార్తలు వస్తున్నాయి. అయితే కృష్ణ గారికి చెల్లెలు కూడా ఉందని మనందరికీ తెలుసు.. మరి ఆమె చెల్లెలి భర్త కూడా టాలీవుడ్ లో ఓ ప్రముఖ స్థానంలో ఉన్నారని చాలామందికి తెలియదు.. మరి వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.. కృష్ణ గారి కుటుంబ నేపథ్య విషయాల్లోకి వెళ్తే కృష్ణ గారికి ఇద్దరు తమ్ముళ్ళు,ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారట. కృష్ణ గారు తమ్ముడైన హనుమంతరావు పద్మాలయ స్టూడియో కు సంబంధించిన కొన్ని సినిమా భాద్యతలను చూసుకునేవారట. ఆయన ఇంకో తమ్ముడు ఆదిశేషగిరి రావు గారు అన్నతోనే ఉండేవారు.

ఈ విధంగా కృష్ణ అన్నదమ్ములు ఇద్దరు పద్మాలయ స్టూడియో నుంచి వచ్చిన సినిమాలను దగ్గరుండి చూసుకునేవారట. ఇక కృష్ణ చెల్లెలు విషయానికొస్తే ఇద్దరు చెల్లెలు. లక్ష్మీ తులసి, అలివేలు మంగమ్మ. ఇందులో లక్ష్మి తులసి భర్త అంటే కృష్ణ బావ మనందరికీ తెలిసిన ప్రముఖ వ్యక్తి.. ఆయన ఎవరో కాదు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా పద్మావతి బ్యానర్ పై ఎన్నో సినిమాలు నిర్మించిన ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు గారు. ఆయన స్వయానా కృష్ణకు బావ అవుతారు. తన బావ నిర్మాణ సారథ్యంలో కూడా కృష్ణ చాలా సినిమాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *