ప్రముఖ డైరెక్టర్ గా , నిర్మాత గా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విజయనిర్మల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ ను రెండో వివాహం చేసుకున్న తర్వాత మరింత పాపులారిటీని దక్కించుకుంది. అంతేకాదు సుమారుగా కొన్ని పదుల సంఖ్యలో చిత్రాలను తెరకెక్కించిన లేడీ డైరెక్టర్ గా గిన్నిస్ బుక్ లో కూడా స్థానం సంపాదించుకుంది. ఇకపోతే విజయనిర్మల అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల ను రెండవ వివాహం చేసుకున్నారు..అయితే కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి ఉండగానే ఆయన ఇలా రెండవ వివాహం చేసుకోవడంతో అప్పట్లో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.

ఒకవైపు విజయనిర్మలకి కూడా ఇది రెండవ వివాహం కావడం గమనార్హం. ఈ క్రమంలోనే విజయనిర్మల మొదటి భర్త ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఏం చేస్తుంటాడు? ఎందుకు విడాకులు తీసుకుంది? అనే విషయాలు మాత్రం ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. విజయనిర్మల మొదటి భర్త విషయానికి వస్తే. ఆయన పేరు కృష్ణమూర్తి.. కృష్ణ తో సినిమాలు చేసే సమయంలోనే విజయనిర్మల కృష్ణమూర్తి అనే అతన్ని వివాహం చేసుకుంది.. కృష్ణమూర్తి షిప్ డిజైనింగ్ ఇంజనీర్ గా పనిచేసేవారు.

వీరిద్దరికీ జన్మించిన కొడుకే నరేష్.. నరేష్ కూడా మనందరికీ బాగా తెలిసిన నటుడే.. కొన్ని సంవత్సరాలు పాటు సంసారం సజావుగానే సాగింది. కానీ విజయనిర్మలకు సినిమాల మీద ఇష్టం.. రోజురోజుకు పెరిగిపోయింది.. కానీ విజయనిర్మల సినిమాలలో నటించడం కృష్ణమూర్తికి ఏమాత్రం ఇష్టం లేదు. కృష్ణమూర్తి వద్దని ఎంత వారించినా..సినిమాల మీద మోజుతో కట్టుకున్న భర్తతోనే విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యింది. అలా తానే స్వయంగా సంసారంలో నిప్పులు పోసుకుందని చెప్పవచ్చు.

కృష్ణమూర్తికి విడాకులు ఇచ్చి ఆ తర్వాత సినిమాలలో బిజీ అయిన ఈమె తన తోటి నటుడు కృష్ణతో ప్రేమలో పడింది . ఆ ప్రేమ కాస్త పెళ్లి వరకు దారి తీసింది. కృష్ణ కూడా తన మొదటి భార్య ఇందిరా దేవిని ఒప్పించి మరి విజయనిర్మలను వివాహం చేసుకున్నాడు. ఇకపోతే విజయనిర్మల 2019లో అనారోగ్య కారణాల వల్ల మరణించిన విషయం తెలిసిందే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *