టాలీవుడ్ కు చెందిన ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఈపాటికే ఆ ఇద్దరు హీరోలు ఎవరో మీకు అర్థమైపోతుంది. అవును, ఒకరు విక్టరీ వెంకటేష్ కాగా.. మరొకరు నాగార్జున. మొదట వెంకటేష్ విషయానికి వస్తే.. ఈయ‌న‌ నటించిన `నారప్ప`, `దృశ్యం 2` చిత్రాలు కరోనా కారణంగా గత ఏడాది డైరెక్ట్‌ ఓటీటీలో విడుదలయ్యాయి. అయినప్పటికీ ఈ చిత్రాలకు మంచి ఆదరణ లభించింది.

ఈ ఏడాది వెంకీ `ఎఫ్ 3` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సమ్మర్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. అయితే `ఎఫ్ 3` విడుదలై ఇన్ని నెలలు గడుస్తున్న వెంకటేష్ ఇప్పటివరకు తన తదుపరి చిత్రం ఏ ద‌ర్శ‌కుడితో అన్నది ప్రకటించలేదు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న `కిసీ కా భాయ్ కిసీ కి జాన్` చిత్రంలో గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నారు.

అలాగే రానా దగ్గుబాటితో కలిసి `రానా నాయుడు` అనే వెబ్ సిరీస్ చేశారు. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న‌ ఈ సిరీస్ త్వరలోనే ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ‌ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. వీటి సంగతి పక్కన పెడితే వెంకటేష్ తన తదుపరి చిత్రం ఎవ‌రితో అన్న‌ది క్లారిటీ ఇవ్వ‌కుండా సైలెంట్ అయిపోయారు. ఇక మరోవైపు నాగార్జున సోలోగా హిట్ అందుకుని చాలాకాలం అయిపోయింది. ఈయన ఇటీవల `ది ఘోస్ట్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద బొక్క బార్ల పడింది.

ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న‌ నాగార్జునకు నిరాశ ఎదురయింది. అయితే `ది ఘోస్ట్` అనంతరం నాగార్జున ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు అన్న‌దానిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. పైగా నాగార్జున తదుప‌రి చిత్రం ఆయన కెరీర్ లో తెర‌కెక్క‌బోయే 99వ ప్రాజెక్ట్. ఈ మూవీని డైరెక్ట్ చేసే అవకాశం నాగార్జున ఎవరికి ఇస్తారా అని అభిమానులు ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. కానీ నాగార్జున మాత్రం మౌనం వీడ‌టం లేదు. మొత్తానికి అటు వెంకీ, ఇటు నాగ్ ఇద్దరూ త‌మ‌ తదుపరి ప్రాజెక్టులను అనౌన్స్‌ చేయకుండా రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. దీంతో ఈ ఇద్దరు సీనియర్ స్టార్స్ గ్యాప్ తీసుకున్నారా..? లేక వచ్చిందా..? అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *