బాలకృష్ణ మొదటిసారి హోస్ట్గా చేస్తున్న అన్ స్టాపబుల్ సెలబ్రెటీ టాక్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సీజన్లో కేవలం సినిమా సెలబ్రిటీలను ఆహ్వానించిన ఆహా నిర్వాహకులు.. రెండవ సీజన్ కి మాత్రం కాస్త భిన్నంగా పొలిటికల్ టచ్ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే మొదటి ఎపిసోడ్ కు చంద్రబాబు నాయుడు ను అతిథిగా ఆహ్వానించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆహా.. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి.. మరొకసారి పొలిటికల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు

ఇదిలా ఉండగా నాలుగవ ఎపిసోడ్ కి సంబంధించి ఇప్పటికే ఒక ప్రోమో ను ఆహా బృందం విడుదల చేయగా.. ఇందులో కిరణ్ కుమార్ రెడ్డి, బాలక్రిష్ణ మధ్య స్నేహబంధం, కాలేజ్ డేస్ లో వీరుద్ధరూ చేసిన అల్లరి పనులను చాలా చక్కగా చూపించారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన మరొక ప్రోమోను విడుదల చేయగా ఇందులో పొలిటికల్ విషయాలను టచ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఏపీ మూడు రాజధానులకు సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి లపై ప్రశ్నల వర్షం కురిపించారు బాలయ్య. ” దీనికి ముందు ఉన్న పరిస్థితుల వేరు.. ఇప్పుడున్న పరిస్థితులు వేరు.. ఇప్పుడున్న లిటిగేషన్స్” తో అంటూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి.

మరొకవైపు ఇదే విషయంపై ” భిన్నత్వంలో ఏకత్వం కాదు భిన్నత్వమే ఏకత్వం” అంటూ మూడు రాజధానులపై ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు సురేష్ రెడ్డి. మరి మూడు రాజధానులతో పాటు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాలపై నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి కూడా తమ అభిప్రాయాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే శుక్రవారం నవంబర్ 25 వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే ఆ రోజే ఈ ఎపిసోడ్ ఆహ్వానం స్ట్రీమింగ్ కానుంది.

ఇకపోతే ఈ షోలో వీరిద్దరితో పాటు సీనియర్ హీరోయిన్ రాధిక కూడా పాల్గొన్నారు. మొత్తానికి ప్రోమో చూస్తుంటే సరదాగా సాగడంతో పాటు రాజకీయ అంశాలను కూడా టచ్ చేసినట్లు కనిపిస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *