ప్రేమ అనేది ఎప్పుడు? ఎలా? ఎవరితో? పుడుతుందో చెప్పడం కష్టం . అలా ఈ క్రమంలోనే కొంతమంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలో ఉన్న వారిని వివాహం చేసుకుంటే, మరి కొంత మంది బయట వ్యక్తులను వివాహం చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది వ్యతిరేకంగా టాలీవుడ్ హీరోయిన్లు.. బుల్లితెర నటులను ప్రేమించి వివాహం చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. ఈ క్రమంలోని టాలీవుడ్ యంగ్ హీరో తనీష్ హీరోగా.. ఆయన సరసన హీరోయిన్గా నటించిన నితి టేలర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. త్రినాధరావు నక్కిన తెరకెక్కించిన “మేం వయసుకు వచ్చాం” చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. తన అందచందాలతో యువతను ఆకట్టుకుంది. మోడల్ కం బుల్లితెర నటి అయిన ఈమె తెలుగులో ఆశించిన అవకాశాలు అందుకోలేదు.. అడపాదడ సినిమాలలో చేస్తూ ప్రస్తుతం హిందీ బుల్లితెరపై కెరియర్ ను వెతుక్కునే ప్రయత్నం చేస్తోంది.

Exclusive: Kaisi Yeh Yaariaan actress Niti Taylor to participate in Jhalak  Dikhhla Jaa 10?అక్కడ డాన్స్ రియాల్టీ షోలు , వెబ్ షోలు చేస్తూ బిజీ అయిపోయింది నితి. ప్రస్తుతం ఈమె తన కోస్టార్ తో డేటింగ్ చేస్తోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. బుల్లితెర నటుడితో జోరుగా ప్రేమాయణం సాగిస్తోందని.. ఇద్దరు కూడా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఒక రేంజ్ లో పండిస్తున్నారు అని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.. తాజాగా నితి నటించిన “కైసీ యే యారియాన్ 4” వీడియో క్లిప్ ఒకటి లీక్ అయింది.. ఇందులో నటుడు పార్థ సమతాన్, నితి టైలర్ నడుమ స్టీమీ సీన్ యువతను బాగా ఆకట్టుకుంది.

Mem Vayasuku Vacham: at TeluguPeople.com Photo Galleryఇద్దరి నడుమ కెమిస్ట్రీ చూశాక అభిమానులు కూడా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ షో విపరీతమైన అభిమానులను కలిగి ఉంది. ఇప్పుడు సీజన్ 4 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 4వ తేదీ నుంచి వూట్ లో స్ట్రీమింగ్ కానుంది. పార్థ సమతాన్, నితి టేలర్ల వీడియో ఇప్పుడు బయటకు రావడంతో వీరిద్దరి మధ్య నిజంగానే కెమిస్ట్రీ కుదిరింది.. ఇద్దరు ప్రేమలో ఉన్నారు అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

రీల్ జోడి కెమెరా ముందు కూడా ఎంతో సన్నిహితంగా.. ఒకరికొకరు చాలా సౌకర్యంగా ఉన్నామని నిరూ పించారంటూ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇది మొదటి ముద్దు అయినా లేదా అందమైన క్షణమైనా.. అభిమానులు ఈ కొత్త జంటను బాగా ఆరాధిస్తున్నారు. మరి పెళ్లి వరకు వెళ్తారో లేక మధ్యలోనే బ్రేకప్ చేసుకుంటారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *