సాధారణంగా స్టార్ హీరోలైనా.. యంగ్ హీరోల సినిమాలలో అయినా సరే హీరోయిన్లు కేవలం ముద్దు ముచ్చట సన్నివేశాలు, రొమాన్స్ పాత్రలకు మాత్రమే పరిమితమవుతూ ఉంటారని కొంతమంది విశ్లేషిస్తూ ఉంటారు. కానీ హీరోయిన్స్ లో ఉన్న ప్రతిభను బయటకు తీస్తే ఖచ్చితంగా వారిలో మరో టాలెంటు తప్పకుండా మనకు తారసపడుతుంది. మరికొంతమంది తమలో ఉన్న ప్రతిభను బయటకు తీసి సాహసం చేసి మరీ విజయాలను అందుకొంటూ ఉంటారు. అలాంటి వారిలో తెరపై ఎవరు చేయని విధంగా మొదటిసారి వేశ్య పాత్రలో నటించి మరింత పాపులారిటీని దక్కించుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి తెలుగు స్టార్ హీరోయిన్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

అనుష్క:Throwback Thursday 10 Years of Anushka shetty Allu Arjun Starrer Vedamసాంప్రదాయానికి చీర కట్టినట్టు ఉండే ఈ ముద్దుగుమ్మ మొదటిసారి అల్లు అర్జున్ , మంచు మనోజ్ హీరోలుగా నటించిన వేదం సినిమాలో వ్యాంప్ పాత్రలో నటించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఛార్మీ:Posterhouzz Jyothi Lakshmi Charmy Kaur Movie Wall Poster : Amazon.inదర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లేడీ ఓరియంటెడ్ చిత్రం జ్యోతిలక్ష్మి లో ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్ర పోషించినప్పటికీ ఇందులో వ్యాంప్ పాత్ర పోషించింది.

టబు:Tabu in Balu Mahendra film - Anal Katru - extraMirchi.comబాలయ్య నటించిన భక్తి రస చిత్రం పాండురంగడు సినిమాను కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇందులో బాలయ్య – టబు మధ్య మితిమీరిన శృంగార సన్నివేశాలు తెరకెక్కించారు. ఇందులో ఆమెది వేశ్య పాత్ర.

శ్రియ శరన్:
కెరీర్ కొంచెం డౌన్ అయిన తర్వాత శ్రియా పవిత్ర టైటిల్ తో తెరకెక్కిన చిత్రంలో వేశ్యగా నటించింది.

సంగీత:
సంగీత కూడా తమిళ చిత్రం ధనం సినిమాలో వేశ్య పాత్రలో నటించి ఆకట్టుకుంది. అంతేకాదు ఈమె ఈ సినిమాలో కొంచెం బోల్డ్ గా కూడా కనిపించడం గమనార్హం.

రమ్యకృష్ణ:
కమలహాసన్ హీరోగా వచ్చిన కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం పంచతంత్రంలో కూడా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ వేశ్య పాత్ర చేశారు.

ఇక వేరే కాకుండా హిందీ మూవీ డి డే సినిమాలో నయనతార వేశ్య పాత్ర పోషించగా.. అలనాటి తారలు సైతం ఇలాంటి పాత్రలు చేయడానికి వెనుకాడ లేదు. ప్రేమాభిషేకం సినిమాలో జయసుధ, మేఘసందేశం సినిమాలో జయప్రద కూడా వేశ్య పాత్రలు చేశారు. ఈ రెండు సినిమాలలో కూడా ఏఎన్ఆర్ హీరోగా నటించడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *