పదహారణాల తెలుగంధం స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందంతో, అభినయంతో, నటనతో కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న స్నేహ హోమ్లి బ్యూటీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె నటించిన ప్రతి సినిమాలో కూడా సాంప్రదాయానికి మారుపేరు అన్నట్టుగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఒకవైపు హీరోయిన్ గా మరొకవైపు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ అటు వెండితెరకు ఇటు బుల్లితెరకు బాగా దగ్గరయింది. ఇకపోతే సాధారణంగా సినీ ప్రపంచంలో ముందడుగు వేయాలి అంటే గ్లామర్ షో చేయాల్సిందే.

కానీ అలాంటి సమయంలో కూడా స్నేహ పద్ధతిగా ఉంటూ హద్దులు మీరకుండా ఫ్యామిలీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు స్నేహ అంటే విపరీతమైన ఇష్టం. ఇకపోతే స్నేహ అసలు పేరు సుహాసిని. సినిమాలోకి వచ్చిన తర్వాత తన పేరును స్నేహాగా మార్చుకుంది. మలయాళం సినీ ఇండస్ట్రీ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన స్నేహ ఆ తర్వాత తెలుగు హీరోయిన్ గా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఈ క్రమంలోనే తెలుగులో 15 సినిమాలకు పైగా నటించిన ఈమె తమిళంలో ఏడు సినిమాలలో నటించింది.

తెలుగులో తొలివలపు సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా వచ్చి ప్రియమైన నీకు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఇక తర్వాత హనుమాన్ జంక్షన్ ,శ్రీరామదాసు, మహారధి , సంక్రాంతి, మధుమాసం, దట్ ఈజ్ పాండు , వెంకీ , రాధాగోపాలం ఇలా చెప్పుకుంటూ పోతే ఏకంగా వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సన్నాఫ్ సత్యమూర్తి , వినయ విధేయ రామ సినిమాలలో నటించి మంచి మార్కులను సంపాదించుకుంది.

సినిమాల పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్నేహ వ్యక్తిగతంగా ఇబ్బంది పడింది. ప్రసన్న అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీళ్ళ ప్రేమ ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు . ఈ కారణంగానే ప్రసన్నతో పెళ్లి వద్దు అంటూ స్నేహ తరుపు వాళ్ళు నానా రచ్చ చేశారు. కానీ తనే కావాలని పట్టుబట్టి మరీ పెళ్లి చేసుకుంది. అయితే మూడు సంవత్సరాల పాటు ఇంట్లో పెద్దవాళ్లు ఒప్పుకుంటారని అనుకున్న స్నేహ. చివరికి వారు ఒప్పుకోకపోయే సరికి ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది . ఇకపోతే ఇంత పద్ధతిగా నటించే స్నేహ తన వ్యక్తిగత జీవితంలో ఎందుకు కుటుంబానికి వ్యతిరేకంగా నిలిచింది అన్నది మాత్రం ఆమె జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *