ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధిని దీర్ఘకాలిక కండరాల వాపు అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ వ్యాధితో సమంత పోరాటం చేస్తోంది. దాని నుంచి బయటపడడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అభిమానులు, సినీ ప్రముఖులు మ‌రియు సన్నిహితులు సమంత త్వరగా కోలుకోవాలంటూ గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షిస్తున్నారు.

అయితే తాజాగా ప్రముఖ నటి శ్రియా సైతం సమంత వ్యాధి గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్ చేసింది. రీసెంట్ గా శ్రియా `దృశ్యం 2` హిందీ రీమేక్ తో నార్త్ ప్రేక్షకులను పలకరించింది. అజయ్ దేవగన్ ఇందులో ప్రధాన పాత్రను పోషించారు. పోయిన శుక్రవారం విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబ‌డుతుంది. ఈ సినిమా అందించిన విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న శ్రియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల‌ను పంచుకుంది. ఈ క్రమంలోనే సమంత గురించి ప్రస్తావన రాగా.. శ్రియా ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో బయట పెట్టింది. శ్రియా మాట్లాడుతూ.. `వ్యక్తిత్వ పరంగా సమంత చాలా మంచిది. కోస్టార్స్ తో ఎంతో స‌ర‌దాగా ఉంటుంది. అలాగే ఆమె స్ట్రాంగ్ గర్ల్. ఇది ఆమె జీవితంలో చిన్న దశ మాత్రమే. సమంత మయోసైటిస్ రుక్మతను ఎదిరించి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తుంది. ఆ నమ్మకం నాకుంది` అంటూ శ్రియా చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్‌ కాస్త వైరల్‌గా మారాయి.

కాగా, సమంత శ్రియా కలిసి `మనం` మూవీలో కలిసిన నటించారు. ఇందులో నాగార్జునకి జోడిగా శ్రియా నటిస్తే, నాగచైతన్య సరసన సమంత చేసింది. ఈ మల్టీస్టార‌ర్ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాతోనే సమంత శ్రియా మధ్య స్నేహబంధం ఏర్పడింది. ఇక సమంత విషయానికి వ‌స్తే.. రీసెంట్గా ఈ బ్యూటీ `యశోద` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. హరి-హ‌రీష్ ద్వ‌యం దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అఖండ విజయం సాధించింది. మ‌యోసైటిస్ కార‌ణంగా సమంత ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన‌లేక‌పోయింది. కానీ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టి ఆమెకు మంచి విజయాన్ని అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *