టాలీవుడ్ యంగ్ అండ్‌ మోస్ట్ హ్యాండ్సమ్‌ హీరో నాగశౌర్య ఇటీవ‌ల బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ వేసి అనూష శెట్టి అనే అమ్మాయి మెడ‌లో మూడు ముళ్ళు వేసిన సంగ‌తి తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. న‌వంబ‌ర్ 20న బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్లో ఇరుకుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితుల న‌డుమ ప్రేమించిన అమ్మాయితో ఏడ‌డుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు నాగశౌర్య.

వీరి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఇప్ప‌టికే నాగ‌శౌర్య‌, అనూష శెట్టిల మ్యారెజ్ ఫోటోలు సోష‌ల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేశాయి. అయితే తాజాగా నాగ‌శౌర్య భార్య అనూష ఆస్తుల వివ‌రాలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. క‌ర్నాట‌క‌లో జ‌న్మించిన అనూష శెట్టి ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ గా ఎంతో పేరు సంపాదించుకుంది. అనూష డిజైన్స్ పేరుతో బెంగుళూరులో ఆమె పెద్ద ఇంటీరియర్ కంపెనీని నడుపుతుంది.

విలాసవంతమైన విల్లాలు, అపార్టుమెంట్లు, ఆఫీసులకు ఇంటీరియర్ డిజైనర్ సేవలు అందించే అనూష‌.. ప్ర‌పంచంలోనే 40 మంది టాప్ ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ ల‌లో ఒక‌రిగా గుర్తింపు పొందింది. సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు స్టార్ హీరోలు సైతం అనూష ఇచ్చిన ఇంటీరియర్ డెజైన్స్ తోనే తమ భవనాలను నిర్మించుకున్నారు. 2019లో డిజైన‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డును సైతం సొంతం చేసుకున్న‌ అనూష.. భారీగా ఆస్తుల‌ను సైతం కూడ‌బెట్టిందట‌.

అనూష పేరిట ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలిస్తే షాక్ అవ్వ‌కుండా ఉండ‌లేరు. ఆమెకు ఏకంగా రూ. 80 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయ‌ట‌. అనూష‌కు సొంతంగా ఖ‌రీదైన భ‌వ‌నాలు, కార్లు ఉన్నాయ‌ని నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో నాగ‌శౌర్య భార్య అంత రిచ్చా? అంటూ నెటిజ‌న్లు మ‌రియు అభిమానులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *