టాలీవుడ్ లో సీనియర్ హీరో, హీరోయిన్లలో జీవిత రాజశేఖర్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ప్రస్తుతం జీవిత సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ డైరెక్షన్ విభాగంలో మాత్రం పలు చిత్రాలను తెరకెక్కిస్తూ ఉన్నది. జీవిత డైరెక్షన్లో తెరకెక్కించిన చివరి చిత్రం శేఖర్. ఇందులో హీరోగా తన భర్త రాజశేఖర్ నటించారు. ఈ చిత్రం పలు వివాదాలలో చిక్కుకోవడంతో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్ట లేకపోయింది. దీంతో ఈ చిత్రం ఇప్పటికీ ఓటీటి లో విడుదల కాలేదు. మరి రాబోయే రోజుల్లో నైనా ఈ చిత్రం విడుదల అవుతుందేమో తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు తాజాగా జీవితాన్ని టార్గెట్ చేస్తూ ఒక మోసగాడు ఆమెను మోసం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం

కొన్నివారాల క్రితం గుర్తుతెలియని ఒక వ్యక్తి ఫోన్ చేసి తన పేరు షారుక్ ఖాన్ నేను మీ ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చానని చెప్పి ఆ వ్యక్తి కాల్ చేసిన సమయంలో జీవిత వేరే పనులు బిజీగా ఉండడం వల్ల తన మేనేజర్ తో మాట్లాడమని సలహా ఇచ్చిందట. దీంతో ఆ గుర్తు తెలియని వ్యక్తి మేనేజర్ తో మాట్లాడుతూ మీ నెంబర్ పైన బంపర్ ఆఫర్ వచ్చింది. జియో సంబంధిత సంస్థలలో అమ్మే వస్తువులు మీకు కేవలం 50% డిస్కౌంట్తో వస్తాయని తెలియజేశారట ఆ తర్వాత.. మోసగాడు చెప్పిన విధంగా ఆఫర్ నమ్మి అవతలి వ్యక్తులు నమ్మే విధంగా కొన్ని స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేయడం జరిగిందట.

అయితే తన షేర్ చేసిన స్క్రీన్షాట్లలో వస్తువులు ఖరీదు రెండున్నర లక్షల రూపాయలు ఉండగా ఆ వస్తువులను కేవలం రూ.1,25,000 వేలకే పొందాలనుకుంటే ఆ మొత్తాన్ని తనకు పంపాలని సూచించారట దీంతో ఆ వ్యక్తి మాటలను నమ్మిన జీవిత మేనేజర్ ఆ మొత్తాన్ని దుండగుడు చెప్పిన అకౌంట్ లోకి బదిలీ చేయడం జరిగిందట దీంతో మేనేజర్ డబ్బు జమ చేసిన తర్వాత షారుక్ ఖాన్ పరిచయం చేసుకున్న వ్యక్తి ఫోన్ స్విచాఫ్ కావడంతో వెంటనే పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ దుండగుడు చెన్నై ప్రాంతంలో ఉండే నాగేంద్రబాబు అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. ఇక గతంలో కూడా నాగేంద్రబాబు ఎంతోమందికి అవార్డుల పేరుతో మోసం చేశారని పోలీస్ విచారణలో తేలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *