నందమూరి నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఈయనకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ దానిని ఏమాత్రం వాడుకోకుండా తన స్వయంకృషితో ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ కి మొదటి నుండే చాలా మంది స్నేహితులు ఉండేవారు. ఇక ఈ స్నేహితులలో నటుడు రాజీవ్ కనకాల కూడా ఒకరు.

వీరిద్దరూ సినిమాల్లోకి వచ్చినప్పటి నుండి కూడా ఎంతో సన్నితంగా ఉండేవారు. వీరిద్దరి పరిచయం ఒక చిన్న గొడవ తో మొదలై మంచి స్నేహితులుగా మారిపోయారు. ఇక వీరి స్నేహానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే అప్పట్లో ఎన్టీఆర్ నటించే ప్రతి ఒక్క సినిమాలో కచ్చితంగా రాజీవ్ కనకాల ఉండేవారు అంటే వీరి స్నేహం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.అయితే తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఒక ఓల్డ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్టీఆర్ ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ.. నటుడు రాజీవ్ కనకాల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నాకు ప్రతి సంవత్సరం నవంబర్ నెల వస్తే చాలా చిరాకు. ఎందుకంటే నవంబర్ లో చిల్డ్రన్స్ డే వస్తుంది.ఇక చిల్డ్రన్స్ డే రోజు రాజీవ్ కనకాల నాకు హ్యాపీ చిల్డ్రన్స్ డే అని ఒక మెసేజ్ పెడతాడు.ఇక ఆ మెసేజ్ చూస్తే నాకు చాలా విసుగు పుడుతుంది.. అంతేకాదు రాజీవ్ కనకాల తన ఫోన్లో నా పేరును కిడ్ అని సేవ్ చేసి పెట్టుకున్నాడు. ఇక ఈ విషయంలో నాకు మరింత చిరాకు. ఎందుకంటే నాకు ఇప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అలాంటి నాకు రాజీవ్ కనకాల ప్రతి సంవత్సరం హ్యాపీ చిల్డ్రన్స్ డే అని మెసేజ్ పంపడం ఏంటో అంటూ ఎన్టీఆర్ ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సరదాగా చెప్పారట. ప్రస్తుతం ఎన్టీఆర్ కి సంబంధించిన ఆ ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసి నెటిజన్స్ అందరూ నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారనే విషయం మనకు తెలిసిందే. ప్రస్తుత ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *