టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న సూపర్ స్టార్ కృష్ణ గురించి అందరికీ సుపరిచితమే. ఇక ఈయన అందం, అభినయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ మధ్యనే ఇందిరా దేవి, కృష్ణ మరణించడంతో ఆయన కుటుంబం విషాదంలో పడింది.అయితే మహేష్ బాబు తల్లితండ్రులు చనిపోయినా కూడా ధైర్యంగా ఉంటూ తన కుటుంబానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు వ్యక్తిత్వం, గొప్పతనం గురించి ఎన్నోసార్లు చూసాం.

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో sr.ఎన్టీఆర్ నుండి ఇప్పుడున్న యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక రూమర్ బయటికి వచ్చింది. ప్రతి హీరోకి ఎవరో ఒక హీరోయిన్ తో ముడిపెట్టి ఏదో ఒక రూమర్ క్రియేట్ చేస్తారు. కానీ మహేష్ బాబుకు మాత్రం ఇంతవరకు ఏ ఒక్క అమ్మాయితో కూడా ఎఫైర్ వార్తలు వినిపించలేదు. కేవలం మహేష్ బాబు అంటే నమ్రత మాత్రమే అనే పేరు వినిపిస్తుంది. అలాగే మహేష్ బాబు పై ఇప్పటివరకు ఒక్క రూమర్ కూడా రాలేదు. ఎందుకంటే ఈయన వీలైనంతవరకు అమ్మాయిలకు దూరంగా ఉంటారు. ఒకవేళ ఆ హీరోయిన్ తో తనకు ఎఫైర్ అంటగడితే తనకేమీ కాదు.

కానీ ఆ హీరోయిన్ కి చెడ్డ పేరు వస్తుంది అనే ఉద్దేశంతో చాలా వరకు మహేష్ బాబు అమ్మాయిలకు దూరంగా ఉంటారు. అయితే మహేష్ బాబుకు ఇలాంటి మంచి వ్యక్తిత్వం ఉండడానికి ఇద్దరు మహిళలు కారణమట. వాళ్లు మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి, అలాగే ఇందిరా దేవి అమ్మమ్మ దుర్గమ్మ.అయితే మహేష్ బాబు తండ్రి కృష్ణ గారు రెండో పెళ్లి చేసుకోవడం వల్ల మహేష్ బాబు ఎక్కువగా తన అమ్మమ్మ దుర్గమ్మ దగ్గరే ఉండేవాడట. అయితే దుర్గమ్మ అన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉండేదట.ఎలా అంటే కనీసం మహేష్ బాబుమీద ఈగ కూడా వాలనిచ్చేది కాదట. అలాగే మహేష్ బాబుని సినిమాలకు చాలా దూరంగా ఉంచేదట.

కానీ మహేష్ బాబుని మాత్రం సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లకుండా ఆపలేకపోయింది. ఇక మహేష్ బాబు నమ్రతను ప్రేమించాడు అని చెప్పగానే దుర్గమ్మ చాలా సీరియస్ అయిందట. అలాగే మహేష్ బాబు నమ్రతని పెళ్లి చేసుకుంటానంటే కూడా ఆమె ఒప్పుకోలేదని అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. అలాగే కృష్ణ తన బిడ్డకి అన్యాయం చేసి విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా దుర్గమ్మ చాలా బాధపడిందట. అయితే అమ్మమ్మ బాధను దగ్గరుండి చూసిన మహేష్ బాబు తన జీవితంలో ఏ ఒక్కరిని కూడా ఇలా బాధ పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నారట. అందుకే మహేష్ బాబు కేవలం నమ్రతను తప్ప ఏ ఒక్క అమ్మాయిని కూడా కన్నెత్తి చూడరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *