ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టన సమంత అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు.మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక మొదటి సినిమా చేసే టైంలోనే అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు అక్కినేని చైతన్యతో ప్రేమలో పడి కొన్ని రోజులు సీక్రెట్ గా వారి ప్రేమ ఎక్కడ బయట పడకుండా దాచారు. కానీ ఆ తర్వాత పెద్దవాళ్లని ఒప్పించి చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక ఎంతో అన్యోన్యంగా ఉన్న వీళ్ళ జంట పెళ్ళైన నాలుగు సంవత్సరాలకే ఏవో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు.

ఇక వీరి విడాకులు విషయం అప్పట్లో ఓ సెన్సేషన్.అయితే వీళ్ళు విడాకులు తీసుకొని ఏడాది గడిచినా కూడా వీళ్ళ గురించి ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.ఇక విడాకుల తర్వాత సమంతను అక్కినేని అభిమానులు చాలా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.ఇక ఈ విషయంలో సమంత చాలా డిప్రెషన్ల్ లోకి వెళ్ళింది.అయితే ఆ డిప్రెషన్ ఎక్కువై ఆమెకు ఉన్న ఓ అరుదైన వ్యాధి వెలుగులోకి వచ్చింది. సమంతకు మయోసైటిస్ అనే వ్యాధి. ఈ విషయం సమంతనే స్వయంగా చెప్పింది.

అయితే సమంత ప్రస్తుతం థర్డ్ స్టేజిలో ఉందని సమంతతో యశోద సినిమాలో కలిసి నటించిన నటి కల్పిక గణేష్ చెప్పుకొచ్చింది. నటి కల్పిగా గణేష్ కి కూడా అలాంటి వ్యాధి ఉందట. ఆమె ప్రస్తుతం స్పాండిలైటిస్ అనే వ్యాధితో ఏకంగా 13 సంవత్సరాల నుండి పోరాడుతుందట.కానీ ఆ నటికీ కేవలం స్పాండిలైటిస్ అనే వ్యాధి ఫస్ట్ స్టేజ్ లోనే ఉందట.అయితే సమంతకు మాత్రం మయోసైటిస్ థర్డ్ స్టేజ్ లో ఉందని చెప్పింది. అయితే తాజాగా సమంత ఆరోగ్యం చాలా క్రిటికల్ గా ఉంది అంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కండరాల నొప్పి మరింత తీవ్రమై ఆమె ఆరోగ్యం క్షీణించిందని,అపోలో హాస్పిటల్ కి తీసుకువెళ్లారని ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియా వేదిక గా వైరల్ అవుతున్నాయి.ఒకవేళ ఈ వ్యాధి మరీ ముదిరి నాలుగో స్టేజ్ లోకి వెళితే సమంత ఆరోగ్య పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని,కనీసం ఒంటరిగా కూడా సమంత నిల్చునే పరిస్థితి ఉండదు అంటూ డాక్టర్ చెప్పుకొస్తున్నారట.ప్రస్తుతం డాక్టర్లు చెప్పిన విషయం నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది అభిమానులు సమంత త్వరగా ఆ వ్యాధి నుండి కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నారు.ఏది ఏమైనప్పటికి సమంత మళ్లీ తన ఆరోగ్యంపై దృష్టి పెట్టి ఎప్పటిలాగే మంచి మంచి సినిమాలు చేయాలని మనం కూడా కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *