టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ – ఉపాసన జోడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెళ్లయి పది సంవత్సరాలు అవుతున్నా.. వీరి అన్యోన్యతలో మాత్రం ఎటువంటి కలహాలు రాలేదని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అంత అన్యోన్యంగా ఒకరికొకరు ప్రేమగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీరి జీవితంలో ఒక్క పిల్లలు పుట్టడం లేదు అన్న వాదన తప్ప మరే ఇబ్బంది లేదు. ఎంతోమందికి ఆదర్శ దంపతులుగా నిలిచారు రామ్ చరణ్ -ఉపాసన. మరి రామ్ చరణ్ సినిమా విషయానికి వస్తే చిరుత సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ పై చిరంజీవి అభిమానులు ప్రేమ వర్షం కురిపించారు.

చిరుత సినిమా తర్వాత మగధీర సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయారు రామ్ చరణ్. రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. ఇదిలా ఉండగా ప్రస్తుతం రామ్ చరణ్ కి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళితే రామ్ చరణ్ ఆస్తుల విలువ ఎంత? ఆయన తన భార్య ఉపాసన నుంచి ఎంత డబ్బు కట్నం కింద పొందాడు? అనేది ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్న అంశం.

అసలు విషయంలోకి వెళితే.. రామ్ చరణ్ కొణిదెల బ్యానర్ ను ఏర్పాటు చేసి.. పలు సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ బ్యానర్ నెట్ వర్త్ దాదాపు రూ.200 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అదే విధంగా రాంచరణ్ కు గుర్రాలు అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ఆయనకు రూ.20 కోట్ల విలువ చేసే పోలో క్లబ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తన సౌకర్యానికి తగ్గట్టుగా రూ. 60 కోట్ల రూపాయల విలువ చేసే ఒక విల్లా కూడా కొనుగోలు చేశాడు. అంతేకాదు రామ్ చరణ్ కు తన భార్య కి సంభందించిన అపోలో ఆసుపత్రిలో వాటా కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

రోల్స్ రాయల్స్, రేంజ్ రోవర్, ఫెరారీ కార్లు కూడా వున్నాయి. ఈయన చేతికి ధరించే గడియారం ధర సుమారుగా రూ. 75 లక్షల వరకు ఉంటుందని సమాచారం. కట్నం కింద రూ.300 కోట్ల తోపాటు అపోలో హాస్పిటల్స్ లో వాటా లభించడం అంటే ఏ రేంజ్ లో ఉపాసన ఈయనకు ఆస్తి అందించిందో అర్థం చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *