ఈ మధ్యనే సూపర్ స్టార్ కృష్ణ గారు అనారోగ్య సమస్యలతో మరణించారు. ఇక ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి ఓ తీరని లోటు అని చెప్పవచ్చు. ఇక ఈ విషయంలో చాలామంది మహేష్ బాబు ఒంటరివాడయ్యారు అంటూ బాధపడ్డారు. అయితే కృష్ణ చనిపోయినప్పటి నుండి ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే కృష్ణ సంపాదించిన ఆస్తుల గురించి కూడా ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి.ఇక కృష్ణ తన రెండో భార్య విజయనిర్మల ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండేవారు. విజయనిర్మల చనిపోయాక కూడా కృష్ణ ఆ ఇంట్లోనే విజయనిర్మల కొడుకు నరేష్ కుటుంబంతో ఉన్నారు.

ఇక ఈ విషయంలో విజయ నిర్మల సంపాదించిన ఆస్తి మొత్తంలో కృష్ణ గారికి కూడా కొంచెం చెందుతుంది అని ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలపై తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ్ క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. విజయనిర్మల ఆస్తి కృష్ణ గారికి చాలానే వచ్చిందని అలాగే కృష్ణ గారు తన ఆస్తిపాస్తులు అన్ని కొడుకుల పేరు మీద రాయాక మనవరాళ్ల మనవాళ్ళ పేరు మీద రాసారని ఇలా కృష్ణ గారి మీద ఏవేవో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో ఎలాంటి వాస్తవం లేదు. విజయనిర్మల విజయకృష్ణ బ్యానర్ మీద తన సినిమాలు తెరకెక్కించింది. అలాగే కృష్ణ గారు పద్మాలయ స్టూడియోస్ మీద సినిమాలు తెరకెక్కించారు. ఇక వీరిద్దరూ వేర్వేరు బ్యానర్ల మీదనే సినిమాలు తెరకెక్కించారు. అలాగే ఎవరి సినిమాకి వచ్చిన లాభాన్ని వాళ్లే తీసుకున్నారు.

అంతే తప్ప వీరిద్దరూ పంచుకోలేదు. అలాగే విజయనిర్మల ఉన్నప్పుడు హైదరాబాదులో ఎన్నో ఆస్తులు కొనుగోలు చేసింది. ఇక విజయనిర్మల కొన్న ఆస్తిలో కృష్ణ గారికి ఎలాంటి వాటా ఉండదు. అలాగే ఇన్ని రోజులు కృష్ణ గారు ఉన్న ఇల్లు కూడా విజయనిర్మలదే.ఈ ఆస్తిలో కూడా కృష్ణ గారి కి ఎలాంటి హక్కు లేదు.ప్రస్తుతం ఆ ఇల్లు నరేష్ కి చెందుతుంది. ఇక విజయనిర్మల మరణించే ముందు తన ఆస్తిలో కొంత భాగం నరేష్ మొదటి భార్య కొడుకు అయినా నవీన్ విజయకృష్ణ పేరు మీద రాసింది. విజయనిర్మలకు తన మనవడు నవీన్ విజయ్ కృష్ణ అంటే చాలా ఇష్టం. అందుకే తన మనవడి పేరు మీద కొంత ఆస్తిని రాసింది. ఇక ఈ విషయంలో చాలామంది విజయనిర్మల వల్ల కృష్ణ గారి కి చాలా ఆస్తులు వచ్చాయి అనే ప్రచారాలు చేస్తున్నారు. ఇదంతా అవాస్తవం. కృష్ణ గారి కి పద్మాలయ స్టూడియో ఉంది.

అతను చనిపోయాక కూడా ఆ స్టూడియో తన కుమారులకే వస్తుంది. అలాగే కృష్ణ గారి పెద్ద కొడుకు రమేష్ ఫ్యామిలీ కూడా బాగానే సెటిల్ అయింది. అలాగే మహేష్ బాబు కూడా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. అలాగే కృష్ణ గారి కూతుర్లు కూడా బాగానే సెటిల్ అయ్యారు. ఇక ప్రస్తుతం ఎవరి దగ్గర ఉన్న ఆస్తి వారిదే.కృష్ణ గారి ఆస్తి కృష్ణ పిల్లలకు చెందుతుంది. అంతేకానీ నరేష్ నుండి కృష్ణ గారి పిల్లలకు ఏం రాదు. కృష్ణ గారి నుండి నరేష్ కి ఏం పోదు. ఇదే నిజం. అలాగే ఇన్ని రోజులు కృష్ణ గారు ఉన్న ఇల్లు కూడా నరేష్ కే చెందుతుంది. ఇక పద్మాలయ స్టూడియోస్ మీద వచ్చిన లాభాలన్నీ కృష్ణ గారి పిల్లలకే చెందుతాయి. అలాగే విజయనిర్మల కొన్న ఆస్తులు అన్ని ఆమె కొడుకు నరేష్ కే దక్కుతాయి. ఇక ఈ విషయంలో గొడవలు పెట్టుకుంటున్నారు అంటూ వచ్చే వార్తల్లో ఎలాంటి నిజాలు లేవు అంటూ చాలా స్పష్టంగా చెప్పారు తమ్మారెడ్డి భరద్వాజ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *