మెగా స్టార్ చిరంజీవి హీరో గా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా లోనుంచి మాస్ పాట ఈరోజు విడుదల అవుతుందని చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది. చెప్పినట్లుగా ఈ సినిమా లోని బాస్ పార్టీ పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పాటలో చిరు తో పాటు ఊర్వసి రౌతెలా స్తేప్పులేసింది.

బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా అయన స్టైల్ లో ఈ పాట మారుమోగిపోతుంది అని చెప్పాలి. గతంలో చిరు తో కలిసి దేవి శ్రీ ప్రసాద్ ఎన్నో సినిమాలు హిట్ కొట్టారు. అలా ఈ సినిమా తో అయన మరో మంచి ఆల్బమ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారని చెప్పాలి.

వాల్తేరు వీరయ్య చిత్రంలో ర‌వితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న ఈ మూవీలో శృతిహాస‌న్ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. వాల్తేరు వీరయ్య 2023 జనవరి 13న సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

అయితే ఈ పాట ప్రోమో వచ్చిన దగ్గరినుంచి కొంత ట్రోల్ జరిగింది. మెగా ఫ్యాన్స్ మాత్రం చిన్న టీజర్ చూసి ఈ పాట మీద ఒక అంచనాకు వచ్చేయొద్దని అంటున్నారు. ఇంతకుముందు ‘ఊ అంటావా’ పాట విషయంలోనూ ముందు నెగెటివ్‌గానే స్పందించారని.. తర్వాత అదే ట్రెండ్ సెట్టర్ అయిందని.. ‘బాస్ పార్టీ’ కూడా అలాగే పెద్ద హిట్టవుతుందని వాళ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *