తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి వరుస ఫోటోషూట్స్ తో ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈమె చేస్తున్న ఫోటోషూట్ కి సూపర్ రెస్పాన్స్ కూడా వస్తోంది. అయితే ఇదే జోరులో స్నేహ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. లేటెస్ట్ గా స్నేహారెడ్డి వేసుకున్న డ్రెస్ మాత్రం డిస్కషన్స్ కి దారి తీసింది. ముఖ్యంగా ఆమె వేసుకున్న స్టైలిష్ డ్రెస్ చూసి నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. స్నేహ లేటెస్ట్ ఫోటోషూట్ కోసం వేసుకున్న డ్రెస్ తో ఇదివరకే జాన్వి కపూర్ కూడా ఫోటో షూట్ చేసింది. దీంతో ఇప్పుడు స్నేహా రెడ్డి పై విమర్శలు కూడా చేస్తున్నారు.

అంతేకాదు ఈ డ్రెస్ లో జాన్వీనే బొద్దుగా , ముద్దుగా ఉందని స్నేహ రెడ్డి అసలు బాగోలేదని కూడా ట్రోల్ చేస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తన స్టైలిష్ ఫోటో షూట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నా సరే ఎక్కడో ఒకచోట ఇలాంటి విమర్శలు వస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే జాన్వి కపూర్ వేసుకున్న డ్రెస్ తోనే స్నేహ రెడ్డి ఫోటో షూట్ చేయడంతో జాన్వీ కపూర్ తో స్నేహారెడ్డి ని కంపేర్ చేస్తూ మరి కామెంట్స్ చేస్తున్నారు.

అయితే స్నేహ రెడ్డి చేసిన ఈ ఫోటోషూట్ అల్లు కాంపౌండ్ లో కొంచెం ప్రకంపనలు సృష్టిస్తోందని చెప్పాలి. అయితే ఇద్దరు పిల్లల తలైతే మాత్రం తను ఫ్యాషన్ గా ఉండాలన్న కోరిక ఉండదా అని కొంతమంది ఆమెను సమర్ధిస్తుంటే .. మరికొంతమంది భర్త అల్లు అర్జున్ కి లేని బాధ నీకెందుకు అంటూ మరి కొంతమంది ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏమో ఇప్పటివరకు ఏ స్టార్ హీరో భార్య కూడా ఇలాగా అందాలు ఆరబోయడంలో లిమిట్ క్రాస్ చేయలేదు కానీ అల్లు స్నేహారెడ్డి ఎందుకు ఇలా చేస్తోంది అంటే ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే ఎవరు ఎన్ని చేసినా ఒక స్త్రీకి స్వతంత్రం ఉంటుంది అలాంటప్పుడు ఇలా విమర్శలు చేయడం తప్పు అంటూ మరికొంతమంది ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. నిజానికి జాన్వి కపూర్ వేసుకున్న డ్రెస్ ని ఈమె వేసుకోవడం వల్ల మొత్తానికి కోలుకోలేని దెబ్బ పడిందని చెప్పాలి. ఈ దెబ్బకు స్నేహ రెడ్డి ఫోటో షూట్ ఆపేస్తుందా లేక కంటిన్యూ చేస్తుందో చూడాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *