మనం ఒక్కోసారి అనుకోకుండా, తెలియకుండా చేసిన పనులు మనల్ని అడ్డంగా బుక్ చేస్తాయి. అవి పొరపాటు అని తెలియకుండానే మనం చేసి చిక్కులో పడతాం. అయితే ప్రస్తుతం ఇలాంటి పనే చేసి అడ్డంగా బుక్క య్యాడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ ఆ మాట తెలుసి అన్నాడో తెలియక అన్నాడో తెలియదు కానీ ప్రస్తుతం అల్లు అర్జున్ హేటర్స్ చాలామంది సోషల్ మీడియాలో ఈయనపై ట్రోల్ చేస్తూ టార్గెట్ చేస్తున్నారు. ఇక విషయంలోకి వెళ్తే.. అల్లు అర్జున్ సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

అలాగే తన ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నో విషయాలను సోషల్ మీడియాలో తన అభిమానులతో షేర్ చేసుకుంటారు. అలాగే తన పిల్లలకు సంబంధించిన ఎన్నో క్యూట్ క్యూట్ వీడియోలు నెట్టింట్లో షేర్ చేస్తూ చాలా మురిసిపోతాడు. అయితే తాజాగా అల్లు అర్జున్ తన కూతురు అల్లు అర్హ బర్త్డే సందర్భంగా ఆమె చేసిన ఒక క్యూట్ వీడియోని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇక ఈ వీడియోలో అల్లు అర్హ మాట్లాడుతూ.. వాళ్ళ ఇంట్లో కందిరీగలు పెట్టిన ఒక పుట్ట గురించి చెబుతుంది. ఇక కందిరీగలు పెట్టిన పుట్ట గురించి అల్లు అర్జున్ మాట్లాడేటప్పుడు ఏదో ప్రశ్నిస్తే దానికి అల్లు అర్హ తెలంగాణ భాషలో పుట్ట గురించి సమాధానం చెబుతుంది.

దానికి అల్లు అర్జున్ ఏంటిది తెలంగాణ యాసలో అన్నట్లుగా తన కూతురిని ప్రశ్నిస్తాడట. ఇక ఈ చిన్న పాయింట్ ని పట్టుకొని అల్లు అర్జున్ హెటర్స్ అల్లు అర్జున్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు చాలామంది తెలంగాణ ప్రజలు ఆయనను విమర్శిస్తున్నారు. కొంతమందేమో తెలంగాణ యాసలో మాట్లాడొద్దు కానీ తెలంగాణలో మీరు చేసే సినిమాలు మీకు తెలంగాణ లో అభిమానులు ఉండాలి. అలాగే మీ బిజినెస్ లు, స్టూడియోలు, ప్రాపర్టీలు అన్ని తెలంగాణలోనే ఉండాలి. కానీ మీరు మాత్రం తెలంగాణ భాషను తక్కువ చేస్తారు. మీ పాప తెలంగాణ లో మాట్లాడితే వచ్చిన నష్టం ఏంటి. మీ భార్య నల్గొండ బిడ్డ. అందుకనే మీ పాప తెలంగాణ యాసలో మాట్లాడుతుంది.

మీరు ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణలో ఎందుకు ఉంటున్నారు అక్కడికే వెళ్లిపోండి. ఇక్కడి అభిమానులు కావాలి..ప్రాపర్టీలు కావాలి..కానీ భాష మాత్రం వద్దు. మీరు ఈ తెలంగాణ భాషను కించపరుస్తున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా బన్నీ మీద ఎన్నో కామెంట్లు చేస్తున్నారు. అయితే బన్నీ మీద వస్తున్న ఈ కామెంట్లు ఆయనకు తెలుసో లేదో కానీ నెట్టింట్లో వాళ్ళు చేసిన కామెంట్లు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. అయితే బన్నీ చేసే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రాంతీయ వాదం కూడా చెలరేగే అవకాశం ఉందని చాలామంది భావిస్తున్నారు. ఇక ఈ విషయంలో అల్లు అర్జున్ ఎలా క్లారిటీ ఇస్తాడో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *