చిరంజీవి హీరో గా బాబీ దర్శకత్వంలో రూపొండుతున్న వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. శ్రుతి హసన్ కథానాయిక గా నటిస్తున్న ఈ సినిమా నుంచి బాస్ పార్టీ అనే పాటను చిత్ర బృందం నిన్న విడుదల చేసింది.

చిరంజీవి –  బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాపై చిత్రీకరించిన పాట ఇది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా  ‘క్లబ్బుల్లోన పార్టీ అంటే షరా షరా మామూలే’ అంటూ ఈ పాట సాగుతోంది. దేవిశ్రీ సాహిత్యాన్ని అందించి ఆయన స్వరం కలపడం జరిగింది. నకష్ అజాజ్ – హరిప్రియ ఈ పాటను ఆలపించారు.

ఈ సినిమాలో రవితేజ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందనీ, ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *