టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రజ యమలీల చిత్రం ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అటు పిమ్మట వరుస సినిమాలలో నటిస్తూ తన అందంతో కుర్రాళ్ళ ను మాత్రమే కాదు స్టార్ హీరోలను సైతం కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. యమలీల సినిమా తర్వాత వరుస అవకాశాలను అందుకొని కెరియర్ పీక్స్ లో ఉండగానే బిజినెస్ మాన్, నటుడు అయినటువంటి మహమ్మద్ అప్సర్ ను వివాహం చేసుకుంది. వివాహం అనంతరం ఇండస్ట్రీకి దూరమైన ఈమె ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి బుల్లితెర ప్రోగ్రామ్స్ లో జడ్జ్ గా వ్యవహరిస్తూ.. మళ్ళీ పాపులారిటీ సంపాదించుకుంది.

అలాగే కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ అమ్మ, అక్క లాంటి పాత్రలు చేస్తూ బిజీ నటిగా మారిపోయింది. ఇదిలా ఉండగా ఇంద్రజ సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆమెపై ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ఒక స్టార్ హీరోతో ప్రేమలో పడిందని.. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎన్నో రోజులపాటు చట్ట పట్టాలేసుకొని తిరిగిన ఫోటోలు , వీడియోలు తెగ వైరల్ చేశారు నెటిజన్స్. అయితే ఏమైందో తెలియదు కానీ ఇద్దరు మధ్య దూరం ఏర్పడి బ్రేకప్ అయింది. ఇంద్రజ ఆ స్టార్ హీరోలో మార్పు చూడడం వల్లే అతడి గురించి ఆరా తీసింది అంట.

Indraja reveals how she got married despite objection from parents | Entertainment news | English Manoramaనిజానికి ఆ హీరోను ఎంతో నమ్మిన ఇంద్రజ.. అతడు తప్పు చేస్తున్నాడు అంటే నమ్మలేకపోయింది. కానీ తప్పని పరిస్థితుల్లో అనుమానం వచ్చిన వెంటనే ఆరా తీయగా ఒక సంచల నిజం బయటపడింది.. ఆ స్టార్ హీరో తనతో చనువుగా ఉంటూనే ఇంకొక అమ్మాయితో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడని తెలిసి తట్టుకోలేక హీరోని పెళ్లి చేసుకోవాలనుకున్న తన ఆలోచనని కూడా మార్చుకుందట. ఒకానొక సమయంలో తాను మోసపోయానని తెలిసి..బాధను తట్టుకోలేక ఎందుకు ఇలా చేశావని ఆ స్టార్ హీరోని అడగగా.. అతడు ఆమెను చాలా దారుణంగా అవమానించి.. నీ రేటెంతో చెప్పు.. నీ మొహాన డబ్బు పడేస్తా అంటూ డబ్బులు కూడా విసిరేసారట.

ఆ స్టార్ హీరో అన్నమాటలు భరించలేక ఇంద్రజ చాలా రోజులపాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. కానీ ఎట్టకేలకు ఆ బాధ నుంచి బయటపడే మళ్లీ తన కెరియర్లో సక్సెస్ అందుకుందని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *