ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో వెండితెరపై స్టార్ హీరోలతో కలిసి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షక ఆదరణ సంపాదించుకున్న ఎంతోమంది హీరోయిన్లు.. ప్రస్తుతం వారి సెకండ్ ఇన్నింగ్స్ ను బుల్లితెరపై ప్రారంభించడం ఆశ్చర్యకరం. ఏదో ఒక విధంగా ప్రేక్షకులకు దగ్గరవుతూ ప్రేక్షకులలో ఒకరిగా మరింత పాపులారిటీని దక్కించుకుంటున్న హీరోయిన్స్ ఒకప్పుడు వెండితెరపై ఒక వెలుగు వెలిగి.. ఇప్పుడు బుల్లితెరపై కూడా దూసుకుపోతున్నారనే చెప్పాలి. అలాంటి వారెవరో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

రాశి:
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగిన రాశి .. ఆ తర్వాత విలన్ గా కూడా తనలో ఉన్న ప్రతిభను కనబరిచింది . అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో “జానకి కలగనలేదు” అనే సీరియల్ లో జ్ఞానాంభ పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర రాశికి మంచి పేరు తీసుకొచ్చిందని చెప్పవచ్చు.

కస్తూరి శంకర్:
ప్రస్తుతం బుల్లితెరపై ” ఇంటింటి గృహలక్ష్మి” సీరియల్లో తులసి పాత్రలో అద్భుతంగా నటిస్తూ ప్రేక్షక ఆదరణ పొందిన కస్తూరి.. సినిమాలలో అన్నమయ్య తో పాటు మరెన్నో చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది

ఆమని:
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. శుభలగ్నం, మావిడాకులు వంటి ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకున్న ఆమని.. ఇప్పుడు సినిమాలలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ “ముత్యమంత ముద్దు” అనే సీరియల్ లో నటిస్తూ మరింత గుర్తింపు సంపాదించుకుంటోంది. ఆమని తన సెకండ్ ఇన్నింగ్స్ లో సహాయ పాత్రలలో నటిస్తూ బిజీగా మారిపోయింది. అంతేకాదు అప్పుడప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలకి కూడా హాజరవుతూ ఉంటుంది.

ప్రభ:
టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ప్రభ నాగేశ్వరరావు, ఎన్టీఆర్ వంటి హీరోల సినిమాలలో కూడా హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సినిమాలలో నటిస్తూ బాగా పాపులారిటీని దక్కించుకున్న ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు సీరియల్స్ లో నటించింది. ఈ క్రమంలోనే “కలిసి ఉంటే కలదు సుఖం” అనే సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా వీరంతా కూడా అటు టాలీవుడ్ ఇటు బుల్లితెర పై కూడా నటిస్తూ అభిమానులకు కూడా మరింత దగ్గరయ్యారని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *