టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు పొందిన అక్కినేని నాగచైతన్య-సమంత ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. `ఏం మాయ చేసావే` సినిమాతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు అంగీకరించడంతో చై-సామ్‌ 2017 లో గోవా వేదికగా రెండు సాంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అప్పట్లో వీరి పెళ్లి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

పెళ్లి తర్వాత అటు చై, ఇటు సామ్‌ ఇద్దరు కూడా కెరీర్ పరంగా సక్సెస్ ఫుల్ గా రాణించారు. అలాగే బయటకు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. కానీ, అనూహ్యంగా సామ్-చై డైవర్స్ తీసుకుని విడిపోయారు. విడాకులు తీసుకుని ఎవరి దారులు వారు చూసుకుంటూ కెరీర్ లో అత్యున్నత స్థానానికి ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ జంట విడాకుల‌పై అభిమానులు చాలా కుంగిపోయారు.

మ‌ళ్లీ వీరిద్ద‌రూ క‌ల‌వాల‌ని ఎంత‌గానో ఆరాట‌ప‌డుతున్నారు. అయితే నాగచైతన్య సమంత త‌మ‌ వైవాహిక బంధానికి స్వస్తి పలికినప్పటికీ.. వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారంటూ టాలీవుడ్ లో గ‌త కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరి కాంబో ప్రాజెక్టుకు `ఓ బేబీ` దర్శకురాలు నందిని రెడ్డి డైరెక్ట్ చేయ‌నుంద‌ని వార్తలు వచ్చాయి. ఓ బేబీ సినిమా సమయంలోనే సమంత నాగచైతన్యలకు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథను వినిపించి సినిమా చేసేందుకు ఒప్పించిందని.. అప్పుడే అగ్రిమెంట్ పేపర్లపై ఇద్దరి చేత సైన్ చేయించుకుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది.

అయితే ఈ అగ్రిమెంట్ జరిగిన కొద్ది రోజులకే చై-సామ్‌ విడిపోయారు. కానీ అభిమానుల్లో ఒక చిన్న ఆశ మిగిలే ఉంది. నందినీ రెడ్డి తెర‌కెక్కించబోయే సినిమాతో నాగచైతన్య సమంతల మ‌ధ్య‌ విభేదాలు తొలగిపోయి మళ్ళీ కలుస్తారని ఆశించారు. కానీ ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆశ కూడా పోయింది. ఎందుకంటే నందినీ రెడ్డి ఎంత ప్ర‌య‌త్నించినా.. చై-సామ్ క‌లిసి సినిమా చేసేందుకు ఏ మాత్రం ఒప్పుకోవ‌డం లేద‌ట‌. ఇక చేసేదేమి లేక నందినీ రెడ్డి అగ్రిమెంట్ పేప‌ర్స్‌ను చించేశార‌ట‌. దీంతో చై-సామ్ క‌ల‌వ‌న‌ట్లే అని సోష‌ల్ మీడియాలో చ‌ర్చించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *