సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్ లు ఇలా ఎందరో పెళ్లిలు చేసుకొని ఓ ఇంటి వాళ్ళు అవుతున్నారు. కానీ కొంతమంది హీరోలు, హీరోయిన్లు మాత్రం మూడు పదుల వయసు దాటుతున్నా కూడా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ఇక ఈ విషయంలో ముందుగా హీరో ప్రభాస్ పై అందరి దృష్టి పడుతుంది. 40 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్లి విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. అలాగే హీరోయిన్స్ సదా,అనుష్క, తమన్నా, నిత్యామీనన్ ఇలా చాలామంది హీరోయిన్లు ఇంకా పెళ్లి చేసుకోకుండానే ఒంటరిగా ఉంటున్నారు.

అయితే తాజాగా నిత్యామీనన్ తన పెళ్లికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. ఇక విషయంలోకి వెళ్తే.. నిత్యమీనన్ చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ తన నటనతో మంచి ఇమేజ్ తెచ్చుకుంది. ఈమె ఏమాత్రం గ్లామరస్ పాత్రలు చేయకుండా,ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉంటూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఈ మలయాళ కుట్టి. నిత్యామీనన్ సినిమాలలో నటిస్తూనే వెబ్ సిరీస్ ల ద్వారా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే బుల్లితెర మీద వచ్చే కొన్ని టీవీ షోలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తూ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది.

ఇక ఈమె సినీ కెరియర్ పక్కన పెడితే..నిత్యామీనన్ 34 ఏళ్ల వయసు వచ్చినా కూడా పెళ్లి చేసుకోవడం లేదు. ఇక ఈ విషయంలో ఆమె అభిమానులు అందరూ ఈమె పెళ్లి విషయంలో గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ నిత్యామీనన్ మాత్రం తన పెళ్లి మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే తాజాగా నిత్యామీనన్ తను ఎలాంటి వాడిని పెళ్లి చేసుకుంటుందో క్లారిటీ ఇచ్చింది. నిత్య మీనన్ మాట్లాడుతూ.. నేను ఇండియా సంస్కృతి సంప్రదాయాలను బాగా నమ్ముతాను.

వివాహం అంటే అది ఒక సోషల్ సెటప్ అస్సలు కాదు. అది ఫైనాన్షియల్ తో ముడిపడి ఉన్న ఒక సెటప్. కానీ నాకు అలాంటి సెక్యూరిటీ ఏం అవసరం లేదు. ఒకవేళ దానికి మించి ఏదైనా ఉంటే కచ్చితంగా ఆలోచిస్తాను. కానీ ఈ విషయంలో దానికి మించి ఆలోచనలు ఉన్న వ్యక్తి ఎవరైనా దొరికితే నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అంటూ నిత్యామీనన్ చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు నిత్యామీనన్ కి అలాంటి వ్యక్తి ఎప్పుడు దొరుకుతాడో? ఆమె పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతుందో?అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *