తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా నటించిన అల్లు అర్జున్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాలో ఈయన చేసిన నటనకు చాలామంది ఫిదా అయ్యారు. గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరస సినిమాలు చేస్తూ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఇక ఈ మధ్యనే ఈయన నటించిన పుష్ప సినిమా విడుదలై ఎంత ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.

అలాగే ఈ సినిమాకి ఎన్నో విభాగాల్లో అవార్డులు కూడా వచ్చాయి. అయితే తాజాగా అల్లు అర్జున్ ని బుల్లితెర మీద జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుదీర్ తో పోలుస్తూ అల్లు అర్జున్ సుడిగాలి సుదీర్ కన్నా వేస్ట్ అంటూ అల్లు అర్జున్ హేటర్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి అలా ఎందుకు అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. బుల్లితెర మీద జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుదీర్ ప్రస్తుతం వెండితెర మీద కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

అయితే ఈ విషయం పక్కన పెడితే తాజాగా యూట్యూబ్లో సుధీర్ అల్లు అర్జున్ పేరును పెట్టి మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో ఓపెన్ గా చెప్పేయండి అని ఓ ఆన్లైన్ పోల్ పెట్టారు. ఇక ఈ పోల్ లో ఒక షాకింగ్ నిజం బయటపడింది. అదేంటంటే అల్లు అర్జున్ కన్నా ఎక్కువ 69% ఓట్లు సుడిగాలి సుధీర్ కి వచ్చాయి. ఇక కేవలం అల్లు అర్జున్ కి 31 శాతం మాత్రమే రావడంతో ఈ విషయం తెలిసిన వారందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. పాన్ ఇండియా హీరో కి ఈ బుల్లితెర యాంకర్ కన్నా తక్కువ ఫాలోయింగ్ ఉందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాదు ఆన్లైన్ పోల్ స్క్రీన్ షాట్ తీసుకొని ట్విట్టర్లో పోస్ట్ చేసి అల్లు అర్జున్ పై తన యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్స్ చేయడం మొదలుపెట్టారు. ఇక సుధీర్ కంటే అల్లు అర్జున్ పెద్ద వేస్ట్ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ విషయంలో తాత తండ్రి పేరు చెప్పుకొని వచ్చిన నీకన్నా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన సుధీర్ కే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అంటూ సోషల్ మీడియా వేదిక కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ విషయంలో సుడిగాలి సుధీర్ కి పాన్ ఫాలోయింగ్ ఎంతుందో అర్థం చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *