ఈ మధ్యకాలంలో ఘట్టమనేని ఫ్యామిలీలో వరుసగా మూడు మరణాలు సంభవించాయి. ఇక మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ మరణం ప్రతి ఒక్కరిని కలిసివేసింది. ఈయన మరణ వార్త వినగానే ఆయన అభిమానులు అందరూ వెక్కివెక్కి ఏడ్చారు. అభిమానులు మాత్రమే కాదు ఆయనతో అనుబంధం ఉన్న సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక తండ్రి మరణ వార్త విని సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కసారి గా షాక్ అయ్యారు.

ఇక తండ్రి మరణంతో మహేష్ బాబు ఒక్కసారిగా ఒంటరివాడైపోయాడు. ఎందుకంటే ఈ మధ్యనే తల్లి ఇందిరాదేవి కూడా మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ విషయం పక్కన పెడితే తన మరణం తో మహేష్ బాబు ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే ఈ సంవత్సరంలో వరుసగా ఘట్టమనేని ఇంట్లో ముగ్గురు మరణించారు. ఈ ముగ్గురు మరణంతో మహేష్ బాబు చాలా డిప్రెషన్ లోకి వెళ్లారు.

దీంతో ఇప్పుడు కుటుంబానికి అండగా ఉండాలి అనే ఉద్దేశంతో కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక ఈ వార్త తెలిసిన మహేష్ అభిమానులు ఏంటన్నా మీకు మేమున్నాం.నువ్వు సినిమాలు మానేయడం ఏంటి..నువ్వు ఒంటరి వాడివని ఎప్పుడు అనుకోకు..మేమందరం నీకోసం ఉన్నాం..కన్నవాళ్ళు దూరమైతే ఏంటి?మేము మీకు ఎప్పటికీ దగ్గరగానే ఉంటాం అంటూ మహేష్ బాబు నిర్ణయం పై ఆయన అభిమానులు అతనికి సపోర్ట్ ఇస్తూ మాట్లాడుతున్నారు.

ఏది ఏమైనప్పటికీ మహేష్ బాబు ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకోవడం ప్రతి ఒక్కరిని బాధపెడుతోంది. ఎందుకంటే మహేష్ బాబు అంతటి స్టార్ హీరో సినిమాలకు దూరంగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ విషయంలో అభిమానులు మాత్రం మహేష్ బాబు నిర్ణయాన్ని అస్సలు ఒప్పుకోవడం లేదు.కచ్చితంగా మీరు సినిమాలు చేసి తీరాల్సిందే మేము మీకు అండగా నిలుస్తాం అంటూ భరోసా ఇస్తున్నారు. ఇక ఈ విషయంలో నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియాలంటే మహేష్ బాబు నేరుగా క్లారిటీ ఇవ్వాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *