ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణవంశీ గురించి.. ఆయన తెరకెక్కించిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన తెరకేక్కించిన అన్ని సినిమాల్లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ప్రేక్షకులలో ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న కృష్ణవంశీ.. ఇటీవల..ఈయన నుంచి ఒక సినిమా కూడా రాలేదని చెప్పాలి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. నిజానికి కృష్ణవంశీ సినిమాలు వస్తున్నాయి అంటే.. ఆయన తన సినిమాలలో హీరోయిన్లను చాలా అందంగా చూపిస్తారు. అందుకే చాలామంది హీరోయిన్లు ఆయన సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తారన్న సందేహం లేదు.

హీరోయిన్లను తెరపై అందంగా చూపించడంలో కృష్ణవంశీ మార్కు వేరనే చెప్పాలి.. కానీ ఆయన మాత్రం హీరోయిన్ల అందం గురించి తాను పట్టించుకోనని అంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ.. టాలీవుడ్ హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో అందరూ హీరోయిన్లను బాగా చూపిస్తానని అందరూ అంటుంటారు.. కానీ సినిమాలు చేసే సమయంలో హీరోయిన్లపై పెద్దగా దృష్టి పెట్టను అంటూ.. ఆయన తెలిపారు. వారు మామూలుగానే అందంగా ఉంటారు. కాబట్టి హీరోయిన్లుగా సినిమాలు చేస్తున్నారని.. అలాంటి వారిని మనం అందంగా చూపించడంలో ఏముంటుంది అంటూ ఆయన తెలిపారు.

ముఖ్యంగా కెమెరాకు అనుగుణంగా పెట్టే యాంగిల్స్ కారణంగా వారి అందానికి మరింత అందం వస్తుందని కూడా కృష్ణవంశీ తెలిపారు. అమ్మాయిలను చూపించే విషయంలో తనను బాపు గారితో పోల్చుతూ ఉంటారని.. ఆయన లెజెండ్రీ డైరెక్టర్.. ఆయనతో తనను పోల్చుకోలేని కూడా కృష్ణవంశీ వెల్లడించారు. తన సినిమాల హిట్ , ఫ్లాప్ గురించి మాట్లాడుతూ.. వరసగా సిక్సర్లు చూశాను.. అలాగే డకౌట్స్ కూడా చూశాను అంటూ చమత్కరించారు.

మొదట్లో కొన్ని హిట్ సినిమాలు చూసి గర్వంగా అనిపించేది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసేసరికి మనదేం లేదనే విషయం అర్థమవుతుంది. నా కెరియర్ లో బెస్ట్ ఫిలిం ఏదని ఎవరైనా అడిగితే మాత్రం.. ఇప్పటికీ కూడా చెప్పలేనని చెబుతాను అంటూ కృష్ణవంశీ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *