బుల్లితెర షోలలో నంబర్ వన్ కామెడీ షో గా దూసుకుపోతున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ షో ప్రారంభమయ్యే దాదాపు 9 సంవత్సరాలు పైనే కావస్తున్నా జబర్దస్త్ షో మాత్రం టాప్ టీఆర్పితో రేటింగ్ సొంతం చేసుకుంటుంది. అయితే జబర్దస్త్ టీఆర్పి రేటింగ్ అంతలా పెరగడానికి ఒకప్పుడు సుడిగాలి సుదీర్ కారణమైతే ఇప్పుడు హైపర్ ఆది అని జనాలు చెబుతున్నారు. కానీ హైపర్ ఆది పంచులు వేస్తే మాత్రం ఫ్యామిలీతో కలిసి ఈ షో చూడలేము అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన మాట్లాడే వల్గర్ మాటలు, డబుల్ మీనింగ్ బూతు పదాలు పిల్లలు ఉంటే చెడిపోయే ప్రమాదం కూడా ఉంది.

అయితే యువత మాత్రం ఫోన్ లో యూట్యూబ్ లో హైపర్ ఆది స్కిట్స్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా మల్లెమాల జబర్దస్త్ షో కి సంబంధించిన కొత్త ప్రోమో విడుదల చేశారు. జబర్దస్త్ కి హోస్ట్గా వ్యవహరించిన అనసూయ వెళ్ళిపోవడంతో ఆస్థానాన్ని భర్తీ చేస్తూ రష్మీ గౌతమ్ ఆ స్థానాన్ని భర్తీ చేసింది. అయితే ఈమె కూడా ఇప్పుడు సినిమాలలో బిజీ కావడంతో కొత్త యాంకర్ సౌమ్యరావును తీసుకొచ్చారు మల్లెమాలవారు. అయితే కొత్త పాత అని తేడా లేకుండా మొన్నటి వరకు అనసూయ, రష్మీ ను తన బూతులతో హింసించిన హైపర్ ఆది ఇప్పుడు సౌమ్యరావును తెగ ఇబ్బంది పెడుతున్నాడని చెప్పాలి.

ప్రోమోలో భాగంగా తన స్కిట్ లో తనదైన స్టైల్ లో పంచులు వేస్తూ నవ్వించడమే కాకుండా యాంకర్ పై పంచ్ వేస్తూ తనలోని టాలెంట్ బయటకి తీసుకొచ్చి నవ్వించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే కృష్ణ భగవాన్ . ఈ ప్రపంచంలో అందరూ మరణిస్తే మీరు మాత్రమే ఉంటే ఏం చేస్తారు? అని అడగ్గా.. హైపర్ ఆది ఆమె ఫీలింగ్స్ ని అర్థం చేసుకోకుండా.. మేమిద్దరమే ఉంటే ఒక ప్రపంచాన్ని సృష్టిస్తాము. వరుసగా ఒకరి తర్వాత ఒకరిని కంటూనే ఉంటామని చెప్పుకొచ్చారు. దీంతో హైపర్ ఆది చేసిన కామెంట్ కి ఎలా స్పందించాలో తెలియక సౌమ్య ఒకవైపు ఇబ్బంది పడుతూనే మరొకవైపు సిగ్గుతో నవ్వుతూ తలదించుకుంది. కానీ ఎలాంటి చెత్త జోక్ ఎలా వేసావని కచ్చితంగా తిట్టుకొని ఉంటుందంటూ ఆమె మనసులో మాటగా నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికైతే ఆమెపై ఇలా బూతులతో రెచ్చిపోయి మరొక సారి తన క్యారెక్టర్ ను డౌన్ చేసుకున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *