మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సుదీర్ఘకాలం నుంచి సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న హీరోయిన్ల జాబితాలో తమన్నా ముందు ఉంటుంది. ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి వచ్చి ప‌దిహేనేళ్లు పైనే అయింది. అయినా సరే వ‌ర‌స‌గా ఆఫర్లను అందుకుంటూ కెరియర్ పరంగా దూసుకుపోతోంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. తమన్నా ఈ స్థాయిలో ఉందంటే ఆమె వెనక ఓ వ్యక్తి ఉన్నారు.

ఆ వ్యక్తి లేకుంటే తమన్నా అడ్రస్ లేకుండా పోయేదట. ఇంతకీ అతను మరెవరో కాదు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమన్నా తొలి చిత్రం `శ్రీ` దశరథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్, తమన్నా జంట‌గా నటించారు. 2005లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. తొలి సినిమాతోనే తమన్నా బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ ను మూటగట్టుకుంది. ఈ మూవీ తర్వాత తెలుగులో తమన్నాకు దాదాపు రెండేళ్ల పాటు ఒక్క అవకాశం కూడా రాలేదు.

అలాంటి సమయంలో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తమన్నాను నమ్మి `హ్యాపీ డేస్` సినిమాలో ఆఫ‌ర్ ఇచ్చాడు. ఇందులో వరుణ్ సందేశ్‌ హీరోగా నటించిగా..నిఖిల్, కమలినీ ముఖర్జీ తదితరులు కీలక పాత్రలను పోషించారు. 2007లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో తమన్నాకు యూత్లో ఫాలోయింగ్ పెరిగింది. అలాగే మరిన్ని అవకాశాలు వచ్చేందుకు కూడా హ్యాపీ డేస్ చిత్రం ఎంతగానో సహాయపడింది.

ఈ సినిమా తర్వాత తమన్నా వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకుంది. ఒకవేళ తమన్నకు శేఖర్ కమ్ముల `హ్యాపీ డేస్`లో అవకాశం ఇవ్వకుంటే ఆమె ఈ స్థాయిలో ఉండేది కాదని చాలామంది అంటుంటారు. కాగా, తమన్నా ప్రస్తుత సినిమాల‌ విషయానికి వస్తే.. ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవికి జోడిగా `బోళా శంకర్` సినిమాలో నటిస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవికి సోదరిగా కనిపించబోతోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. అలాగే స‌త్య‌దేవ్‌కు జోడీగా తమన్నా నటించిన `గుర్తుందా శీతాకాలం` విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక‌ వీటితోపాటు తమన్నా చేతిలో మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *