యంగ్ టైగర్ ఎన్టీఆర్ , లక్ష్మీ ప్రణతి దంపతుల గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఇకపోతే లక్ష్మీ ప్రణతి తండ్రి నార్నే శ్రీనివాసరావు ప్రతి ఒక్కరికి సుపరిచితుడే. ఈయన ఎవరో కాదు స్వయంగా ఎన్టీఆర్ కి పిల్లనిచ్చిన మామ.. ఎన్నో సంవత్సరాల కిందటే కట్నం కింద రూ.100 కోట్లు ఇచ్చారనేది అనధికారిక సమాచారం. ఇలా తనకు కోట్ల ఆస్తి, పిల్లను ఇచ్చిన మామను ఇప్పుడు ఎన్టీఆర్ పట్టించుకోవడం లేదనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం నితిన్ అని తెలుస్తోంది.. నితిన్ ఎవరో కాదు నార్నే శ్రీనివాసరావు కొడుకు .. లక్ష్మీ ప్రణతి సోదరుడు .. ఎన్టీఆర్ బావమరిది .. ఇతడి వల్లే ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆయన మామ నార్నే శ్రీనివాసరావు మాట్లాడుకోవడం లేదు అంటూ వార్తలు గుప్పుమన్నాయి.

Jr NTR, wife Lakshmi Pranathi blessed with a baby boy - Hindustan Times
నితిన్ ఇటీవల హీరోగా మారిన విషయం తెలిసిందే. శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నాడు. బావ సినీ బ్యాగ్రౌండ్ .. కోట్లు కుమ్మరించగలిగే తండ్రి బ్యాగ్రౌండ్.. అన్నీ వున్నా కూడా నితిన్ ఎంట్రీకి చాలా కష్టమవుతుంది.. అయితే మొన్నటి వరకు అంతా ఇలానే అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ తన బావమరిదిని పట్టించుకోవడంలేదని ఇన్సైడ్ టాక్.. ఇప్పుడు అల్లుడు ఎన్టీఆర్, మామ నార్నే మధ్య నితిన్ వల్ల భేదాభిప్రాయాలకు దారి చేసింది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎన్టీఆర్ సినిమాలలో బిజీగా ఉంటే అది వేరే సంగతి.. మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ను వీరు విసిగించలేదు. అయితే ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.

జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు ఆఫీసులపై ఐటీ దాడులు | ITraids on Junior NTR father in law ycp leader narne srinivas rao - Telugu Oneindiaప్రస్తుతం ఎన్టీఆర్ ఎలాగో ఖాళీగా ఉన్నాడు కాబట్టి తన బావమరిది సినిమాపై ఫోకస్ పెట్టొచ్చుకదా అని వారి అభిప్రాయం.. కానీ అలా చేయడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది . మరొకవైపు ఎన్టీఆర్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనే వార్తలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అందుకే ఎన్టీఆర్ కి అతని మామకి మధ్య ఏవైనా గొడవలు ఉన్నాయా? అనే కోణంలో ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరోవైపు మహేష్ బాబు ఏమో తన కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రమోట్ చేస్తున్నాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఆ పని చేయడం లేదు . అయితే ఇలా ఎన్టీఆర్ ఎందుకు చేస్తున్నాడు అనే విషయం మాత్రం అంత చిక్కకుండా పోయింది. మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *