బుల్లితెరపై ప్రసారమైన ఎన్నో సీరియల్స్ లలో మంచి పాపులారిటీ తెచ్చుకున్న సీరియల్ అమృతం అని చెప్పవచ్చు. ఇందులో ఎంతోమంది కమెడియన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. దాదాపుగా ఏడు సంవత్సరాల పాటు విరామం లేకుండా ప్రసారమైన ఏకైక కామెడీ సీరియల్ ఇదే. ముందుగా ఇందులో హర్షవర్ధన్, గుండు హనుమంతరావు, అప్పాజీ, సర్వం , శాంతి, తదితరులు సైతం ఇందులో బాగా పేరు సంపాదించారు. అయితే ఆ తర్వాత ఇందులో ఎంతోమంది నటీనటులు సైతం పాల్గొన్నారు. ఇందులో కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హర్షవర్ధన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉన్నారని చెప్పవచ్చు.

Amrutham 2 | అమృతం ద్వితీయం | Telugu serial When will telecast start?ఈ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించడంతో ఇటీవల పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. హర్షవర్ధన్ డైరెక్టర్ రాజమౌళికి ఉన్న బంధం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు హర్షవర్ధన్. హర్షవర్ధన్ మాట్లాడుతూ.. రాజమౌళి గారు అప్పట్లో దర్శకత్వం వహించిన శాంతినివాసం అనే ఒక సీరియల్స్ కి తను రైటర్ గా పనిచేశానని తెలియజేశారు. అంతేకాకుండా తన రైటింగ్ స్కిల్స్ అంటే రాజమౌళికి చాలా ఇష్టమని దాదాపుగా కొన్ని ఎపిసోడ్లు సైతం ఆయన నాతోనే డైలాగులు రాయించారని తెలిపారు. అంతేకాకుండా తనకోసం ఒక ప్రత్యేకమైన పాత్రను కూడా అందులో డిజైన్ చేశారని తెలిపారు.

Amrutham Comedy TV Showఅలా ఆ సీరియల్ తో తనకి మంచి పేరు రావడంతో.. ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకి రాజమౌళి గారికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది ఆ సమయంలో శాంతినివాసం సీరియల్ కు, స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రానికి నిర్మాతగా రాఘవేంద్రరావు గారు వ్యవహరించేవారు. దీంతో రాజమౌళి గారు శాంతినివాసం సీరియల్ బాధ్యతలను తనకు అప్పగించారని అలా ఆయన సినిమాల్లోకి వెళ్లిపోయారని తెలియజేశారు హర్షవర్ధన్. రాజమౌళి గారు అలా సడన్గా తనకు దర్శకత్వ బాధ్యతలు ఇవ్వడంతో తనకి ఏం చేయాలో అర్థం కాలేదని తెలియజేశారు.

ఆ సమయంలో రాజమౌళి దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్పగా ఏమి కాదు నువ్వు చేయగలవు చెయ్యి అని చెప్పి వెళ్లిపోయారట. ఆ తర్వాత నేరుగా రాజీవ్ కనకాల దగ్గరకు వెళ్లి డైరెక్టర్ అంటే ఏమిటి ఎలా చేయాలనే విషయాలను తెలుసుకున్నానని ఆ తర్వాత దర్శకత్వ టెక్నిక్ తనకి చెప్పడంతో అలా పలు సీరియల్స్ కు కూడా డైరెక్షన్ చేశానని తెలిపారు. అటు తర్వాత ఎన్నో చిత్రాలకు డైలాగు రైటర్ గా కూడా పనిచేశానని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *