టాలీవుడ్ లో యంగ్ హీరో గా కొనసాగుతున్న నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తేజ డైరెక్షన్లో వచ్చిన జయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరో మొదటి సినిమాతోనే తన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ ని వేసుకొని మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాలో తన అమాయకమైన ఫేస్ చూసి చాలామంది అట్రాక్ట్ అయ్యారు. ఇక జయం సినిమాలో నితిన్ సదా కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలు, గోపీచంద్ విలన్ గా నటించే తీరు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.

ఇక మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న నితిన్ కి ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో మాచర్ల నియోజకవర్గం సినిమాతో మన ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమా అంతగా హిట్ అవ్వలేదు.ఈ సినిమాలో కంటెంట్ లేకపోవడం వల్లే సినిమా హిట్ కాలేదని సినిమా చూసిన ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు. అయితే మాచర్ల నియోజకవర్గం సినిమా ప్లాఫ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ రారా రెడ్డి చాలా హిట్ అయింది.

ఇక ఐటెం సాంగ్ లో అంజలి నటించి అందరిని అలరించింది.అయితే ఈ ఐటెం సాంగ్ లో ముందుగా సదా ని అనుకున్నారట. అయితే సదా మాత్రం నితిన్ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకోలేదు. జయం సినిమాలో వీరిద్దరూ రాను రానంటూనే చిన్నదో అనే సాంగ్ లో కలిసి డాన్స్ చేశారు. కాబట్టి మాచర్ల నియోజకవర్గ సినిమాలో కూడా ఐటెం సాంగ్ లో సదాని పెడితే సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని అనుకున్నారు.కానీ సదా మాత్రం అందుకు ఒప్పుకోలేదు. అయితే సదా ఒప్పుకోకపోయినప్పటికి కూడా నితిన్ మాత్రం ఆమెకు పదేపదే ఫోన్ చేసి ఇబ్బంది పెట్టే వారట.

ఆమె ఎన్నిసార్లు ఐటమ్ సాంగ్ చేయను అని చెప్పినా కూడా నితిన్ మాత్రం ఫోన్ చేసి చాలా టార్చర్ చేశాడు అనే కామెంట్లు ఈ సినిమా విడుదల కాకముందు ఎక్కువగా వినిపించాయి. కానీ చివరికి సదా నేను ఐటమ్ సాంగ్ చేయను అని నితిన్ కి గట్టిగా చెప్పిందట. ఇక దాంతో అప్పటినుండి నితిన్ సైలెంట్ అయిపోయారు. అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్స్ ఆ సినిమా విషయంలో నితిన్ సదా ని అంత టార్చర్ చేశారా అంటూ మాట్లాడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *