రష్మిక మందన్న..పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకొని నేషనల్ క్రష్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరస అవకాశాలతో ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు దక్కించుకొని అక్కడ కూడా చాలా సినిమాల్లో నటిస్తోంది. అయితే ఆమె బాలీవుడ్ లో నటించిన సినిమాలు అంతగా హిట్టు కానప్పటికీ ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే ఈ మధ్యకాలంలో విడుదలైన కాంతారా సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనకు తెలిసిందే.

ఈ సినిమా ముందుగా కన్నడలో రిలీజ్ అయ్యి ఆ తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యింది.ఇక కాంతారా సినిమాకి హీరో గా డైరెక్టర్ గా రిషబ్ శెట్టి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా విడుదలయ్యాక చాలామంది సెలబ్రిటీలు, స్టార్ హీరోలు హీరోయిన్లు ఈ సినిమాపై తమ అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. అయితే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ సినిమాపై స్పందించారు కానీ సొంత ఇండస్ట్రీలో వచ్చిన కాంతారా సినిమాపై రష్మిక మాత్రం స్పందించలేదు. ఇక ఈ విషయంలో రష్మికపై చాలామంది విమర్శలు చేశారు. అయితే వీరి మధ్య ఉన్న గొడవ వల్లే రష్మిక ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు అంటూ ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక విషయంలోకి వెళ్తే..రిషబ్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీరు నెక్స్ట్ ఏ హీరోయిన్ తో నటించాలి అనుకుంటున్నారు సాయిపల్లవా,రష్మికనా అని యాంకర్ అడగగా.. నేను సమంత తో కలిసి నటించాలని అనుకుంటున్నాను. అంతేకాదు సాయి పల్లవి కూడా మంచి నటి అంటూ చెప్పారు. కానీ ఆ ఇంటర్వ్యూలో రష్మిక పేరు ఎత్తకుండా.. ఆమె ఓ ఇంటర్వ్యూలో రెండు చేతులతో సిగ్నల్స్ ఇచ్చిన దాన్ని ఇమిటేట్ చేసి చూపిస్తూ ఈ హీరోయిన్ తో నేను నటించలేను అంటూ చెప్పేశారట. అంతేకాదు నేను వీలైనంతవరకు కొత్త హీరోయిన్లతో నటించాలని అనుకుంటాను అని రిషబ్ శెట్టి ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే రిషబ్ శెట్టి రష్మిక ని అలా ఎందుకు అన్నారంటే.. కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా రష్మికను ఇండస్ట్రీకి పరిచయం చేసింది రిషబ్ శెట్టినే.

ఈ సినిమా ద్వారానే రష్మిక ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయమైంది. కానీ రష్మిక మాత్రం ఎక్కడికి వెళ్లినా నేను ఒక మ్యాగజిన్ కవర్ మీద ఇచ్చిన స్టిల్ వల్లే నాకు అవకాశాలు వచ్చాయి అంటూ చెప్పుకొస్తుంది. అయితే రష్మిక ఇలా చెప్పడం రిషబ్ శెట్టి కి ఏ మాత్రం నచ్చలేదు. తాను ఇండస్ట్రీకి పరిచయం చేస్తే తన పేరు చెప్పలేదు అని అప్పటినుండి ఆమె మీద కోపం పెంచుకున్నాడట. అలాగే రష్మిక కూడా కాంతారా సినిమా స్పందించకపోవడంతో చాలామంది వీరి మధ్య ఏవైనా గొడవలు ఉన్నాయి కావచ్చు అని భావించారు. ఇక ఈ విషయంలో చాలామంది రష్మికను ట్రోల్ చేశారు మాతృభాషనే పట్టించుకోలేదు అంటూ విమర్శలు చేశారు. ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రిషబ్ శెట్టి ఆ ఇంటర్వ్యూలో రష్మిక కి గట్టి కౌంటర్ ఇచ్చారని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *