మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మలయాళ `ప్రేమమ్` చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన అనుపమ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెర‌కెక్కించిన `అఆ` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే శర్వానంద్ కు జోడిగా `శతమానం భవతి` సినిమా చేసి తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండానే తనదైన అందం, అభినయం, న‌ట‌నా ప్రతిభతో తెలుగు చిత్ర పరిశ్రమంలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుందీ ముద్దుగుమ్మ.

ఇటీవల `కార్తికేయ 2` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ప్ర‌స్తుతం అనుప‌మ నిఖిల్ తో `18 పేజెస్` అనే సినిమా చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుప‌క‌ప‌ ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే మరోవైపు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డతో అనుపమ `డీజే టిల్లు 2` లో నటించబోతోంది.

ఇకపోతే ఇటీవల అనుపమ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయింది. తరచూ గ్లామ‌ర‌స్ ఫోటోషూట్లతో నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. అయితే గతంలో ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం అస్సలు ఇష్టం ఉండదని చెప్పింది. కానీ, ఇష్టం లేకున్నా ఈ మ‌ధ్య అనుప‌మ‌ వరుస పోస్టులు, ఫోటోలతో కుర్రాళ్ల‌ను అట్రాక్ట్ చేస్తుంది. ఇక తాజాగా డబ్బు కోసం యూట్యూబ్ లో వ్లాగ్స్ చేయడం కూడా ప్రారంభించింది.

ఇందులో భాగంగానే మొదటిసారి యూట్యూబ్ లో ఒక వ్లాగ్ వీడియోను పోస్ట్ చేసింది. ఇటీవల కాలంలో ఎందరో సెలబ్రిటీలు యూట్యూబ్లో త‌మ‌కు న‌చ్చిన కంటెంట్ ను పోస్ట్ చేస్తూ మంచి క్రేజ్‌తో పాటు డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు అనుపమ కూడా అదే చేస్తోంది. తాజాగా అనుపమ ఓ సాంగ్ షూట్ కోసం పోలాండ్ వెళ్ళింది. అయితే అక్కడ షూటింగ్ మధ్యలో చిన్న గ్యాప్ దొర‌క‌డంతో చక్కగా ఓ వ్లాగ్‌ వీడియోను షూట్ చేసి యూట్యూబ్లో వదిలింది. ఇంకేముంది ఈ వ్లాగ్‌ క్షణాల్లో వైరల్ అయింది. అభిమానులు, నెటిజ‌న్లు అనుపమ ఫస్ట్ వ్లాగ్ పై లైకులు, షేర్ల వర్షం కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *