దగ్గుబాటి రామానాయుడు అంటే ఇండస్ట్రీలో ఎంత గౌరవం ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన స్టార్ ప్రొడ్యూసర్ గా మూవీ మొగల్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక ఈయన వారసుడి గా వెంకటేష్ ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అలాగే వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. అలాగే సురేష్ బాబు కొడుకు రానా కూడా హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే వెంకటేష్ తన సినీ కెరియర్ లో ఎలాంటి వివాదాలకు తావివ్వలేదు.కానీ రానాని చాలామంది ప్లే బాయ్ అంటూ పిలుస్తారు.

ఎందుకంటే రానా చాలామంది హీరోయిన్లతో అఫైర్లు పెట్టుకొని ప్లే బాయ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇలాంటి రానా ఓ కన్నడ హీరోయిన్ ని పిచ్చిగా ప్రేమించి చివరికి పెళ్లి చేసుకోలేదట. మరి ఎందుకు పెళ్లి చేసుకోలేదో ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ లో ఉన్న బడా ఫ్యామిలీలలో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ ఫ్యామిలీ నుండి స్టార్ ప్రొడ్యూసర్లు, హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక రామానాయుడు పేరుకు వారి కొడుకులు మరింత స్టార్డం తీసుకువస్తే మనవళ్లు రానా, అభిరామ్ మాత్రం కొన్ని వివాదాలు తీసుకొచ్చి ఆయనకు చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఇక టాలీవుడ్ హీరోల్లో ఉన్న అందరిలో రానా ది చాలా భిన్నమైన క్యారెక్టర్.

ఈయన మంచి మనిషే కానీ ప్లే బాయ్ గా పేరు తెచ్చుకున్నారు. రానాకు ఎంతోమందితో పర్సనల్గా ఎఫైర్లు ఉన్నాయంటూ ఎప్పటినుండో పుకార్లు వస్తున్నాయి. అయితే రానా మీహికా బజాజ్ ను పెళ్లి చేసుకోవడానికి ముందే రాగిణి అనే కన్నడ అమ్మాయిని ప్రేమించాడట. ఇక ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏమిటంటే రానా రాగిణి కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదట. కానీ వీరి పరిచయం ఎలా ఏర్పడిందంటే రాగిణి మోడలింగ్ చేసేది. అలాగే రానా కూడా మోడల్ కాబట్టి మోడలింగ్ చేసే టైంలో వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ అప్పట్లో ఇండస్ట్రీలో కూడా టాక్ నడిచింది.

అయితే రానాకు త్రిషతో కూడా ఎఫైర్ ఉందని ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక త్రిష వదిలేశాక రాగిణి తో తిరిగాడు అంటూ అప్పట్లో ఒక రూమర్ వైరల్ అయింది. అయితే సోషల్ మీడియాలో ఏ చిన్న పాయింట్ దొరికినా దాన్ని క్షణాల్లో వైరల్ చేస్తారు. దాంతో ఒక చిన్న క్లూ పట్టుకొని మొత్తం వీరి గురించి తెలుసుకున్నారు. దాంతో ఒకేసారి ఇద్దరూ అడ్డంగా దొరకడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టు అయింది. ఇక వీళ్లిద్దరూ చాలా రోజులు ప్రేమించుకున్నట్టు కూడా ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ వీరు మధ్యలో ఎందుకు విడిపోయారో ఎవరికి తెలియదు. ప్రస్తుతం రానా మిహికా బజాజ్ ను పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *