యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన నందమూరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఆ ఫ్యామిలీ పేరుని ఏమాత్రం వాడుకోకుండా స్టార్ హీరోగా ఎదిగారు.. నిన్ను చూడాలని అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకి అంతగా పేరు రాకపోయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఒక్కసారి గా స్టార్ హీరో అయిపోయారు.అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సన్నగా మారిపోయారు.

కానీ గతంలో చాలా లావుగా ఉండేవారు. అయితే ఎన్టీఆర్ అలా లావు అవ్వడానికి కారణం ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్యనే ఫైట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్ హీరోగా వచ్చిన ఈ మాయ పేరేమిటో అనే సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక ఈవెంట్ లో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ వారి మధ్య ఉన్న అనుబంధం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఇక ఎన్టీఆర్ చేసిన సినిమాలన్నింటిలో ఎక్కువగా ఫైట్స్ అన్ని విజయ్ మాస్టరే కంపోస్ చేశారట.

అలాగే అప్పట్లో ఎన్టీఆర్ అలా లావుగా ఉండడానికి కారణం కూడా విజయ్ భార్య సుమతేనట. అయితే ఎన్టీఆర్ లావుగా ఉండడానికి ఆమె ఎందుకు కారణం అవుతుందని మీరందరూ అనుమాన పడవచ్చు. కానీ ఫైట్ మాస్టర్ విజయ్ కి ఎన్టీఆర్ కి మధ్య ఉన్న అనుబంధం వల్ల ఎన్టీఆర్ కి ఆమె చాలా ఇష్టమైన వంటలు అన్ని వండి పంపేదట. ఇక షూటింగ్ స్పాట్లో సుమతి వండిన వంటలు చాలా ఇష్టంగా తినేవారట ఎన్టీఆర్. ఇక సుమతి ఒకటి రెండు వంటలు కాదు ఏకంగా 200 వరకు ఎన్టీఆర్ కి వండి పంపిందట. ఇక సుమతి చేసిన వంటలు ఇష్టంగా తినడం వల్లే ఎన్టీఆర్ లావైపోయారట.

అంతేకాదు ఆ ఈవెంట్లో ఎన్టీఆర్ సుమతితో తనకు ఉన్న రుణానుబంధం తీర్చుకోలేనిది అని చెప్పుకొచ్చాడు. ఇక ఫైట్ మాస్టర్ విజయ్ ఎన్టీఆర్ కి దగ్గరుండి పెట్టడమే కాదు ఫుడ్ ఎలా తినాలో కూడా నేర్పించే వారట. ఇక ఆ ప్రేమతో వండిన వంటలు తినడం వల్ల ఎన్టీఆర్ అలా లావైపోయాడట. ఇక ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ ఆ తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది అంటూ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *