టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇక అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లి విడాకులు తీసుకున్న తర్వాత సమంత పేరు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. ఆమె ఏ పని చేసినా క్షణాల్లో ఆ పని వైరల్ అయిపోతుంది. తాజాగా ఈమె నటించిన యశోద సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు పోయి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇక ఈ సినిమాతో తన ఖాతాలో మరొక హిట్ ని వేసుకుంది.

ఇక యశోద సినిమాలో సమంత నటన గురించి విమర్శకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. సమంత విషయంలో ఓ యంగ్ హీరో భార్య చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మధ్యనే సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారని అధికారికంగా తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పుకొచ్చింది. ఇక సమంత తనకున్న వ్యాధి గురించి చెప్పగానే చాలామంది సెలబ్రిటీలు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెట్టారు.

ఇక ఈ విషయంలో అందరిలాగే ఆ యంగ్ హీరో కూడా సమంత త్వరగా కోలుకోవాలని కామెంట్ పెట్టాడట. అయితే సమంత త్వరగా కోలుకోవాలని ఆ యంగ్ హీరో పెట్టిన కామెంట్ ని తన భార్య సీరియస్ గా తీసుకుందట. ఇక ఈ హీరో ఈ మధ్యకాలంలో ఆమెను ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉండడం అతని భార్యకు నచ్చడం లేదు. దాంతో వారి మధ్య క్లోజ్ నెస్ చూసిన ఆ యంగ్ హీరో భార్య నువ్వు ఆమెకు కాస్త దూరంగా ఉండు అంటూ వార్నింగ్ ఇచ్చిందట. అయితే ఆ హీరోకి సమంతకి మధ్య ఏం సంబంధం లేకపోయినప్పటికీ సమంత వ్యాధి తెలిసినప్పటి నుండి ఆమె అన్ని విషయాల్లో ఈ హీరో జోక్యం చేసుకోవడం అతని భార్యకు నచ్చడం లేదు.

దాంతో సమంతకు దూరంగా ఉండూ అంటూ చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిందట. సమంత మగవాళ్ళని తొందరగా అట్రాక్ట్ చేస్తుంది. ఆమెకు నువ్వు దూరంగా ఉండు.. లేకపోతే మన మధ్య దూరం పెరిగి విడాకులు తీసుకునే వరకు వెళ్ళవచ్చు అందుకే నువ్వు ఆమె విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండూ అంటూ ఆ యంగ్ హీరోకి కొన్ని కండిషన్లు పెట్టిందట అతని భార్య. అయితే ప్రస్తుతం ఆ యంగ్ హీరో భార్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంలో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు కానీ నెట్టింట్లో మాత్రం ఈ వార్త చక్కర్లు కొడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *