సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోయి వారం రోజులు దాటినా కూడా ఆయన మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు, అభిమానులు. ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పటికీ సినిమాల ద్వారా మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు. ఇక కృష్ణ గారు దాదాపు 350 కి పైగా సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ ఏడాది ఘట్టమనేని కుటుంబంలో వరుసగా మూడు మరణాలు సంభవించి ఆ ఫ్యామిలీని విషాదంలోకి నెట్టేశాయి. తండ్రి మరణంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒంటరివాడయ్యాడు.

ఇక ఆయన అన్నీ మర్చిపోయి ఎప్పటిలాగే మళ్లీ షూటింగ్స్ లో పాల్గొనాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే..తాజాగా కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు గారు కృష్ణ చనిపోయే ముందు ఏం జరిగింది అనే విషయాన్ని బయటపెట్టారు. ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. అన్నయ్య చనిపోయే ముందు రోజు నన్ను రమ్మంటే నేను వెళ్ళాను. ఆరోజు ఆయన మా చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని గుర్తు చేశారు. అలాగే ఆరోజు నన్ను భోజనం కూడా అక్కడే చేయమన్నారు. కానీ ఇంటికి వేరే అతిధులను పిలిచాను రేపు వస్తానులే అన్నయ్య అని ఇంటికి వచ్చేసాను.

ఇక అన్నయ్య కు పడుకున్నాక గురక పెట్టే అలవాటు ఉంది. అలాగే అన్నయ్యని చూసుకోవడానికి అతని రూమ్ బయట ఒక కుర్రాడు ఎప్పుడు ఆయన్ని గమనిస్తూనే ఉంటాడు. అయితే హార్ట్ ఎటాక్ వచ్చిన రోజు రాత్రి 12:30 కు ఆ అబ్బాయి కృష్ణ గారి గురక పెట్టడం లేదు ఏంటి అని చూశాడట. దాంతో భయంతో ఆ కుర్రాడు అన్నయ్య పల్స్ చెక్ చేస్తే ఎర్రర్ అని వచ్చిందట.వెంటనే నాకు ఫోన్ చేసి మీ అన్నయ్యకు హార్ట్ ఎటాక్ వచ్చింది అని చెప్పాడు. దాంతో వెంటనే నేను ఆ కుర్రాడిని నువ్వు హాస్పిటల్ కి తీసుకెళ్ళు నేను వస్తాను అని చెప్పాను. ఇక హాస్పిటల్ కి తీసుకువెళ్లాక దాదాపు 30 గంటలు అన్నయ్య ప్రాణాన్ని కాపాడడానికి డాక్టర్లు చాలా కష్టపడ్డారు. కానీ అప్పటికే చేయి దాటిపోయింది.

అయితే అన్నయ్యకు హార్ట్ ఎటాక్ వచ్చిన 20 నిమిషాల లోపు హాస్పిటల్ కి తీసుకువచ్చి ఉంటే గనుక మా అన్నయ్య బతికేవారు.కానీ ఆయనను ఆసుపత్రికి తీసుకురావడంలో లేట్ అవ్వడం వల్లే రక్త ప్రసరణ నిలిచిపోయింది అంటూ ఆదిశేషగిరిరావు గారు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కృష్ణ గారి గురించి తన తమ్ముడు ఆదిశేషగిరిరావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలియగానే కృష్ణ అభిమానులు అందరూ కాస్త ముందు హాస్పిటల్ కి తీసుకువెళ్లి ఉంటే కనుక ఇప్పుడు మా ముందు కృష్ణ బతికుండేవాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *