కాంతారా.. ఈ సినిమా ఎలాంటి అద్భుతం సృష్టించిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత ఈ సినిమాని అన్ని భాషల్లో విడుదల చేశారు. ఇక విడుదలైన ప్రతి ఒక్క భాషలో ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో మనం ఇప్పటికే చూసాం. ఎలాంటి అంచనాలు లేకుండా ఓ చిన్న సినిమాగా తెరకెక్కి ప్రస్తుతం ఓ పాన్ ఇండియా సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా దర్శకుడిగా హీరోగా రిషబ్ శెట్టి చేశారు. కాంతారా సినిమాతో డైరెక్టర్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు రిషబ్ శెట్టి.

ఇక ఈ హీరో పేరు అప్పట్లో ఎవరికీ తెలిసేది కాదు.కానీ కాంతారా సినిమా వచ్చాక ప్రతి ఒక్కరి నోట్లో రిషబ్ శెట్టి పేరు మారుమోగిపోయింది. ఈయన అంతకుముందే రష్మిక మందన్న రక్షిత్ శెట్టి హీరో హీరోయిన్లుగా వచ్చిన కిరిక్ పార్టీ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా హిట్ అవడంతో దర్శకుడిగా అతనికి మంచి పేరు వచ్చింది. కాంతారా సినిమా హిట్ అయ్యాక ఆయన గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన సినిమాల్లోకి రావడానికి ఎంత కష్టపడ్డాడో ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలాగే ప్రస్తుతం ఆయన గురించి ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అదేంటంటే కన్నడ హీరో రిషబ్ శెట్టి తెలుగు హీరోయిన్ తో ప్రేమాయణం నడిపాడట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలోఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే హరిప్రియ. ఈమె తెలుగు హీరోయిన్ అయినప్పటికి ఇక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో శాండల్ ఉడ్ కి తన మకాం మార్చింది. అయితే తమిళ, కన్నడ సినిమాలో నటించే టైంలో రిషబ్ శెట్టి తో హరిప్రియ ప్రేమలో పడింది అంటూ త్వరలోనే వీళ్ళు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ కూడా అప్పట్లో ఒక రూమర్ వైరల్ అయింది. ఇక వీరిద్దరి మధ్య ఆ రూమర్ రావడానికి ప్రధాన కారణం రిక్కీ అనే సినిమా.

ఈ సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా కాశ్మీర్లో జరిగిందట. అలా షూటింగ్ జరిగిన టైంలో వీరిద్దరూ ఎక్కడపడితే అక్కడ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ అందరి కంట్లో పడ్డారని దాంతో వీరి మధ్య ఏదో ఉందని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా ఏం జరిగిందో ఏమో కానీ వీళ్ళిద్దరి మధ్య పెళ్లి గురించి, బ్రేకప్ గురించి ఎలాంటి వార్తలు రాలేదు. దాంతో వీరి ప్రేమ గురించి అందరూ మర్చిపోయారు. ఇక రిషబ్ శెట్టి తన స్నేహితురాలైనా ప్రగతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *