తెలుగు చిత్ర పరిశ్రమలోఒకప్పడు హీరో గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న హీరో శోబన్ బాబు. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. అమ్మాయిల కలల రాకుమారుడుగా ఆంధ్ర సోగ్గాడు గా పేరు సంపాదించారు. ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు అవకాశాలు సాధించాలి అంటే చాలా కష్ట పడేవారు. ఇప్పుడు కొంతమంది నట వారసులు పలుకుబడితో ఈజీగా ఇండస్ట్రీలోకి చేరిపోతున్నారు. మరి కొంతమంది తమ బంధువుల వారసులను కూడా ఇండస్ట్రీలోకి పరిచయం చేస్తూ ఉన్నారు.

అందుకు నిదర్శనం ఇప్పుడు ఎంతోమంది నటీనటులను మనం చూస్తూనే ఉన్నాము.. నటీనటుల పిల్లలు ,డైరెక్టర్స్ మరియు ప్రొడ్యూసర్స్ పిల్లలు ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమ కెరీర్ ని కొనసాగిస్తున్నారు. మొదటిగా ఎవరో ఒకరు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ఫ్యామిలీ అంత ప్రవేశం చేస్తారు. ఇక తెలుగులో కేరాఫ్ అడ్రస్ గా నిలబడిన అందాలనటుడు శోభన్ బాబు ఈయన డీ గ్లామర్స్ పాత్రలో కూడా బాగానే మెప్పించారు.

ఇక చాలామందికి ఎక్కడ మొదలుపెట్టాలో ఎక్కడ ఆపేయాలో అనే విషయం తెలియదు. కానీ అది శోభన్ బాబుకు అది బాగ సాధ్యమైంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఒక వెలుగు వెలిగారని చెప్పవచ్చు.. అయితే ఈయనకు ఇంత పాపులారిటీ ఉన్నా కూడా మిగతా హీరోల మాదిరి తన కొడుకు కరుణ శేషు ని ఇండస్ట్రీలోకి తీసుకురాలేకపోయారు. అయితే శోభన్ బాబు అలా ఎందుకు చేశాడో అన్న విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది.

తెలుగు నటుడు రాజా రవీంద్ర పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శోభన్ బాబు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రాజా రవీంద్ర మాట్లాడుతూ.. నేను శోభన్ బాబుతో మాట్లాడుతూ..సార్ మీ కొడుకును హీరో చేయరా అని అడిగానని…. అందుకు ఆయన సమాధానం గా ఇలా తెలియజేశారని చెబుతూ.. ఏమిటంటే నేను హీరోగా ఉండి ఏన్నో టెన్షన్లు పడ్డాను.. అలాగే టెన్షన్లు పడుతున్నానని తెలియజేశారట.. కాబట్టి తన కొడుక్కి అలాంటి టెన్షన్లు అవసరమా అని తనకు అనిపించింది. అందుకే శోభన్ బాబు గారు తన కొడుకుని సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంచారని తెలియజేశారు రాజా రవీంద్ర.. దీంతో ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *