టాలీవుడ్ యంగ్ అండ్‌ మోస్ట్ హ్యాండ్సమ్‌ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి మెడలో మూడు ముళ్ళు వేసి బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ వేశాడు నాగశౌర్య. బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

ఇరు కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితులు మాత్రమే వీరి వివాహానికి హాజరు అయ్యారు. నాగశౌర్య పెళ్లి వేడుకల్లో ఏర్పాటు చేసిన విందు భోజనాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెళ్లికి వచ్చిన అతిథులందరికీ రాచరికపు స్టైల్ లో భోజనాలు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటికే నాగశౌర్య పెళ్లికి సంబంధించిన‌ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి.

ఇకపోతే నాగశౌర్య-అనూష‌ల‌ది పెద్దల కుదిర్చిన‌ వివాహం అని చాలా మంది భావించారు. కానీ వీరిది ప్రేమ వివాహమాట. సైలెంట్ గా క‌నిపిస్తూనే తెర వెనుక అనూష తో నాగశౌర్య పెద్ద కథే నడిపించాడని అంటున్నారు. అనూష ఇంటీరియర్ డిజైనర్ అన్న సంగతి తెలిసిందే. అయితే అనూషను నాగశౌర్య ఓ ప్రైవేట్ పార్టీలో కలిశాడట. అలాగే ఆమె చేసిన డిజైనింగ్స్ నాగశౌర్యకు ఎంతగానో నచ్చేవట.

దాంతో అనూష కు పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావడంలో నాగశౌర్య తన వంతు సహాయం చేశాడట. ఆ విధంగా అనూష తో నాగశౌర్యకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందట. ఇరు కుటుంబ సభ్యులు మొద‌ట అభ్యంతరం తెలిపినా.. ఆ త‌ర్వాత వీరి ప్రేమ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ఇక పెద్దల‌ అంగీకారంతో ఈ జంట తమ బంధాన్ని పెళ్లితో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారట. అలా నాగ‌శౌర్య‌-అనూష‌లు ఒకటయ్యారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, సినిమాల విషయానికి వస్తే రీసెంట్గా `కృష్ణ వృంద‌ విహారి` సినిమాతో నాగశౌర్య‌ ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం నాగశౌర్య త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్స్ పై ఫోక‌స్ పెట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *