మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఆయన అప్పట్లో కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. కానీ పాలిటిక్స్ తన కు అంతగా సెట్ అవ్వవు అని భావించి మళ్లీ తిరిగి సినీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు రాజకీయానికి సంబంధించిన కామెంట్లు పెడుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తారు.

అయితే తాజాగా హైదరాబాదులో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొని మరోసారి చిరంజీవి తన నోటి నుంచి రాజకీయం గురించి చెప్పుకొచ్చారు.ఆయన మాటలతో మరొకసారి పాలిటిక్స్ ని హీటెక్కించారు. హైదరాబాదులో చిరంజీవి పూర్వ మిత్రుల సమ్మేళనం అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. పాలిటిక్స్ లో కొనసాగాలంటే కచ్చితంగా రాటుదేలి ఉండాలి. మొరటుగా మారాలి. సున్నితంగా ఉంటే అక్కడ మనం ఎదగలేము. ఒకరిని మాటలు అనాలి మనం వారితో అనిపించుకోవాలి. అందుకే ఇవన్నీ నాకు సూట్ అవ్వవని రాజకీయం అవసరమా అనిపించింది. కానీ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కి కచ్చితంగా సెట్ అవుతాడు. పవన్ ఒకరిని మాట అంటాడు ఒకరితో మాటలు పడతాడు.

ఇక మీ అందరి ఆశీర్వాదాలు పవన్ ని ఏదో ఒక రోజు గొప్ప స్థాయికి తీసుకువెళ్తాయి. అలాగే ఇప్పుడు నేను రాజకీయాలకు దూరంగా ఉండొచ్చు కానీ ఏదో ఒక రోజు నా తమ్ముడు పెట్టిన పార్టీ జనసేనకు ఫ్యూచర్ లో సపోర్ట్ ఇస్తాను కావచ్చు. పవన్ ఎక్కడ ఉండాలో ఏ స్థాయిలో ఉండాలో ఈ ప్రజలే నిర్ణయిస్తారు. ఇలాంటి నిబద్ధత కలిగిన నాయకులే ప్రజలకు కావాలి. పవన్ అత్యున్నత స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అయితే నేను పవన్ కళ్యాణ్ ఇద్దరం రాజకీయంలో చెరోవైపు ఉండడం ఎందుకని నేనే పాలిటిక్స్ నుండి తప్పుకున్నాను. ఇక ఈ విషయంలో ఎంతో కొంత పవన్ కి సహాయం చేసిన వాడిని అవుతాను. ప్రజలు పవన్ మీద నమ్మకం పెట్టుకొని రాష్ట్రాన్ని ఏలే అవకాశం ఇవ్వవచ్చు.

అలాంటి రోజు త్వరలోనే రానుందని నేను ఆశిస్తున్నాను అంటూ చిరంజీవి ఆ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రస్తుతం చిరంజీవి మాట్లాడిన మాటలు రాజకీయాన్ని మరింత హీటెక్కిస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి ఎన్నోసార్లు రాజకీయాల గురించి మాట్లాడి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. అలాగే గాడ్ ఫాదర్ రిలీజ్ కి ముందు కూడా ఆయన పెట్టిన ఓ డైలాగ్ పై అందరూ చర్చించుకున్నారు. అంతేకాదు మళ్లీ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారు కావచ్చు అని అందరు భావించారు. అలాగే ఈ కార్యక్రమంలో చిరంజీవి తాను చదువుకున్నప్పటి రోజులను గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం చిరంజీవి ఆ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *