అనిత చౌదరి.. ఈమె పేరు చెప్పితే ఎవరు గుర్తుపట్టరు. కానీ ప్రభాస్ హీరోగా వచ్చిన చత్రపతి సినిమాలో సూరీడు ఎక్కడున్నావ్ రా అనే డైలాగ్ చెప్తే అందరికీ ఇట్టే గుర్తుకొస్తుంది. అనిత చౌదరి 1990 లోనే బుల్లితెర మీద యాంకర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. ఇక మెల్లిమెల్లిగా సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వచ్చాయి.ఇక ఈమె ఎన్నో సినిమాల్లో వదిన,అక్క పాత్రల్లో చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈమె బుల్లితెర మీద చేసిన సీరియల్స్ లో ఎక్కువగా ఋతురాగాలు, కస్తూరి నాన్న వంటి సీరియల్స్ వల్ల మంచి గుర్తింపు వచ్చింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిత చౌదరి తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది.

అనిత చౌదరి మాట్లాడుతూ.. మా పేరెంట్స్ ది లవ్ మ్యారేజ్. కానీ మా నాన్న మా మమ్మీ ని వదిలేసి పోవడంతో కుటుంబ బాధ్యతలు అన్నీ మా అమ్మనే తీసుకుంది. ఇక ఆ టైంలో నేను కూడా చిన్నతనంలో కుటుంబ బాధ్యతలు నా భుజం వేసుకోవాల్సి వచ్చింది. అందుకోసమే నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. కానీ నా భర్త కృష్ణ చైతన్య ను మొదటి చూపులోనే ఇష్టపడ్డాను. కానీ కృష్ణ చైతన్య అప్పుడు అమెరికాలోనే ఉండేవారు. నేను మాత్రం నువ్వు అమెరికాలో ఉంటే నేను పెళ్లి చేసుకోనని చెప్పాను.

అంతే కాదు అతను ఎంతో ప్రేమగా ప్రపోజ్ చేస్తే నేను రిజెక్ట్ చేశాను. అయితే హీరో శ్రీకాంత్ కి కృష్ణచైతన్య కజిన్ కావడం వల్ల ఓ రోజు శ్రీకాంత్ స్వయంగా నాకు ఫోన్ చేశాడు. కానీ శ్రీకాంత్ నుండి ఫోన్ వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఇక శ్రీకాంత్ నాకు ఫోన్ చేసి మావాడు నిన్ను మ్యారేజ్ చేసుకోవడం కోసం అమెరికా నుండి ఇక్కడిదాకా వచ్చాడు. అతనితో పెళ్లికి ఒప్పుకోవచ్చు కదా అంటూ ఫోన్ చేసి మరీ అడిగారు. అయితే శ్రీకాంత్ అలా అడిగేసరికి నాకు చాలా కోపం వచ్చింది.

ఎందుకంటే తాను స్వయంగా వచ్చి ప్రపోజ్ చేయకుండా వాళ్ల కుటుంబ సభ్యులందరితో అడిగిస్తున్నారనే కోపంతో దాదాపు అతనితో మూడు సంవత్సరాల పాటు మాట్లాడలేదు. దింతో కృష్ణ చైతన్యే నేరుగా నా దగ్గరికి వచ్చి నాకు ప్రపోజ్ చేశాడు. దాంతో అప్పుడు నేను పెళ్లికి ఒప్పుకున్నాను అంటూ అనిత చౌదరి తన పర్సనల్ విషయాల గురించి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనిత చౌదరి మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *