టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరో నాగార్జున బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్నారు. కానీ సక్సెస్ మాత్రం వరించడం లేదు. ఈయ‌న సోలోగా హిట్ అందుకుని చాలాకాలం అయిపోయింది. రీసెంట్ గా ఈ అక్కినేని మన్మధుడు `ది ఘోస్ట్` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో పక్క యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ప్రవీణ్ స‌త్తారు దర్శకత్వం వహించారు.

ఇందులో బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్‌ హీరోయిన్ గా నటించింది. ఎన్నో అంచనాల నడుమ దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుంచే మిశ్రమ స్పందనను దక్కించుకుంది. ఇక టాక్ అనుకూలంగా లేకపోవడంతో ఈ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద చ‌తికిల‌ప‌డింది. మరోవైపు బాలీవుడ్ లో నాగార్జున `బ్రహ్మాస్త్రం` అనే సినిమా చేశాడు.

పాన్ ఇండియా స్థాయిలో విడుదలని ఈ చిత్రం సైతం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు నాగార్జున తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడు అన్నది హాట్ టాపిక్ గా మారింది. నాగార్జున కెరీర్ లో తెర‌కెక్క‌బోయే 99వ ప్రాజెక్ట్ ఇది. అయితే ఇప్పటివరకు తన తదుపరి సినిమాను ఏ ద‌ర్శ‌కుడితో ఉండ‌బోతుందో ప్రకటించలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం.. నాగార్జునకు అసలు దర్శకులే దొరకడం లేదట.

ఇటీవ‌ల బెజవాడ ప్రసన్న అనే రైటర్ ఓ కథ వినిపించగా.. అది నాగార్జునకు బాగా నచ్చిందట. అయితే ఈ కథను రూపొందించే సరైన డైరెక్టర్ నాగార్జునకు దొరకడం లేదని జోరుగా ప్రచారం జరుగుతుంది. అభిమానులు ఏమో నాగార్జున నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ నాగార్జున తన నెక్స్ట్ కు డైరెక్టర్ దొర‌క్క తీవ్రంగా సతమ‌తం అవుతున్నాడ‌ని ప్రచారం జరుగుతోంది. దీంతో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగు నాగార్జునకు దర్శకులు క‌రువ‌య్యారా? ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదంటూ నెటిజ‌న్లు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *