ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు ఎవరు ఊహించిన విధంగా పెళ్లి పీటలు ఎక్కుతూ అందరికీ ట్విస్ట్ ఇస్తున్నారు. ఇక ఈ మధ్యనే నాగశౌర్య పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ నేహా చౌదరి కూడా పెళ్లి పీటలు ఎక్కబోతోందట. మరి ఆమె పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది యాంకర్ నేహా చౌదరి.ఈమె బిగ్ బాస్ హౌస్ కు రాకముందే ప్రేక్షకులకు పరిచయం.

కానీ బిగ్బాస్ తర్వాత అందరికీ మరింత దగ్గరయింది. అయితే ఈమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినప్పటికీ హౌస్ నుండి తొందర్నే ఎలిమినేట్ అయింది. ఇక నేహా విషయానికి వస్తే ఈమె రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో నేషనల్ ఛాంపియన్ గా గోల్డ్ మెడల్ కూడా తీసుకుంది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో బుల్లితెర మీద ప్రసారమయ్యే చాలా షోలలో యాంకరింగ్ చేసి ఫేమస్ అయ్యింది. ఇక నేహా చౌదరి గురించి చాలా రోజుల నుండి పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే నేహా చౌదరి మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి తిరిగి వచ్చాక కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పి వచ్చానని ఇప్పటికే ఆమె ఆ హౌస్ లో చెప్పుకొచ్చింది. అయితే ఆమె ఆ విషయం చెప్పడం వల్ల ఈమె హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక ఈమె మీద పెళ్లి వార్తలు అనేకం వచ్చాయి. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ తాజాగా నేహ చౌదరి “ఐ సెదడ్ ఎస్” అంటూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన ఓ లింక్ ని పోస్ట్ చేసింది.

ఇక తన యూట్యూబ్ లింకులో ఏముందంటే..అలా నేహతో అనే ఒక బ్లాగ్ ఉంది. ఇక ఆ బ్లాగ్ లో “నా పెళ్లి గోల స్టార్ట్ అయింది” అంటూ ఒక వీడియోని చేసి తనకు కాబోయే భర్త గురించి అన్ని విషయాలు చెప్పుకొచ్చింది. ఇక నేహ చౌదరి పెళ్లి చేసుకోబోయేది ఎవరో కాదు తన స్నేహితుడే. నేహా చౌదరి ఆ అబ్బాయి ఇద్దరు క్లాస్మేట్స్. ఇక వీళ్ళిద్దరూ దాదాపు 17 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారట. ఇక ప్రేమకు పులిస్టాప్ పెట్టి దాన్ని వివాహ బంధం గా మార్చుకోబోతున్నారట. ఇక ఈమె పెట్టిన పోస్ట్ చూసినా చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదిక కంగ్రాట్స్ చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *